Job Astrology: కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!

Job Astrology: కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!


జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు విదేశాలకు కారకుడు కాగా కేతువు సొంత ఊరికి కారకుడు. జాతక చక్రంలో కేతువు బలంగా ఉన్నవారు సాధారణంగా తామున్న ఊరును వదిలిపోవడానికి ఇష్టపడరు. వక్ర గ్రహంగా, పాప గ్రహంగా పేరున్న కేతు గ్రహం ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తోంది. స్థిర రాశి అయిన సింహ రాశిలో కేతువు సంచారం వల్ల నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. తామున్న ఊరులోనే పెళ్లి సంబంధం కుదురుతుంది. డిసెంబర్ 6 వరకూ ఇదే రాశిలో ఉండే కేతువు వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి వీటితో పాటు ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల తామున్న ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఉద్యోగం మారే అవకాశం ఉండదు. ఉద్యోగం చేసే ఊరిలోనే అన్ని విధాలా స్థిరపడే అవకాశం ఉంది. వీరికి షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రుణ సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
  2. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల త్వరలో ఉద్యోగం లభించి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో బదిలీలకు, ప్రయాణాలకు అవకాశం ఉండకపోవచ్చు. సొంత ఊరిలోనే ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది కానీ, ఖర్చు చేయడానికి బాగా వెనుకాడతారు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
  3. సింహం: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు ఎక్కువగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. సాధారణంగా సొంత సంస్థను లేదా వ్యాపారాన్ని నెలకొల్పడం జరుగుతుంది. అనుకోని మార్గాల్లో ఆదాయం పెరిగే అవ కాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలు, జూదాలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. తండ్రి వైపు నుంచి వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం పెరిగినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. వీరికి పరిమితమైన కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం మీదే వీరు దృష్టి పెడతారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల ఈ రాశివారికి తామున్న ఊరిలోనే వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడడం జరుగుతుంది. ఉద్యోగంతో పాటు వ్యాపార సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. సాధారణంగా తీర్థ యాత్రలకు తప్ప తామున్న ఊరి నుంచి కదిలే అవకాశం ఉండదు.
  6. మీనం: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఈ రాశివారు సొంత ఊరిలోనే వృత్తి, వ్యాపారాలు చేపట్టే అవకాశం ఉంటుంది. తామున్న ఊరిలోనే వారికి గృహ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో బదిలీలకు అవకాశం ఉండదు. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. లాటరీలు, జూదాలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వాటివల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *