Sivaji Raja: వాడి ఊరు పేరు తెలియదు.. రూ. 35 వేలు సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు..

Sivaji Raja: వాడి ఊరు పేరు తెలియదు.. రూ. 35 వేలు సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు..


Sivaji Raja: వాడి ఊరు పేరు తెలియదు.. రూ. 35 వేలు సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు..

లోకంలో సాయం చేసే చేతులు ఉన్నాయి కానీ, ఆ సాయాన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే మనసులు చాలా అరుదు. మనం చేసే చిన్న మేలు ఒకరి జీవితాన్ని ఎంతలా మారుస్తుందో, తిరిగి వారు మనపై చూపే ప్రేమ మనల్ని ఎంతటి ఆనందానికి గురి చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. శంకర్ గౌడ్ అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని తెలిసి, నటుడు శివాజీ రాజా తన దగ్గర ఉన్న రూ. 35 వేలను అసిస్టెంట్ ద్వారా పంపించారు. అప్పట్లో ఆయన ఒక అపార్ట్‌మెంట్‌కు ఇన్స్టాల్‌మెంట్స్ కడుతున్న సమయం కావడంతో అది పెద్ద మొత్తమే. కానీ, తోటి నటులు మాత్రం దీన్ని విమర్శించారు. “డబ్బు తీసుకున్నాడు కదా, ఇక తిరిగి రాడు.. నీకు బుద్ధి లేదు” అని హేళన చేశారు. రెండు మూడు నెలల పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో శివాజీ రాజా మనసులో కూడా చిన్న అనుమానం మొదలైంది.

అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒకరోజు ఉదయం కరీంనగర్ దగ్గరి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ ముగ్గురు గ్రామస్తులతో కలిసి వచ్చారు. నేరుగా వచ్చి శివాజీ రాజా కాళ్లకు దండం పెట్టి, హాగ్ చేసుకున్నారు. తన ఊరి జాతరకు రావాలని, తన కుమారుడు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడని ఆహ్వానించారు. ఆ మట్టి మనుషుల పిలుపులో ఉన్న స్వచ్ఛతను చూసి శివాజీ రాజా తన షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని మరీ కరీంనగర్ బయలుదేరారు.

గ్రామానికి చేరుకున్న శివాజీ రాజాకు అపూర్వ స్వాగతం లభించింది. డప్పుల మోతలు, ఊరంతా పండుగ వాతావరణం. శంకర్ గౌడ్ తన చిన్న గుడిసెలో శివాజీ రాజా ఫోటోను దేవుడి పక్కన పెట్టి పూజిస్తున్నాడు. అది చూసి ఆయన చలించిపోయారు. గ్రామస్తులందరికి శంకర్ గౌడ్ శివాజీ రాజాను “మా దేవుడు” అని పరిచయం చేశారు. ఆ రోజు వారి మధ్య గడిపిన క్షణాలు, వారితో కలిసి చేసిన డ్యాన్సులు తన జీవితంలో మరెప్పుడూ పొందని గొప్ప ఆనందాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.

ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. శివాజీరాజాకు కిడ్నీ సమస్య వచ్చిందని ఎవరో చెప్పగా విన్న శంకర్ గౌడ్, ఏమాత్రం ఆలోచించకుండా “నా సార్ కోసం నేను కిడ్నీ ఇస్తాను” అని ముందుకు వచ్చారు. ఏకంగా 13 రోజులు అక్కడే నిరీక్షించారు. కేవలం 35 వేల రూపాయల సాయం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి సిద్ధపడటం, ఈ కాలంలో ఊహించని విషయమని. కృతజ్ఞతకు చదువుతో సంబంధం లేదని, అది సంస్కారమని శంకర్ గౌడ్ నిరూపించారని చెప్పొచ్చు.

Also Read: కేవలం 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్లు.! లాటరీ, బెట్టింగ్ కాదు.. ఎలానో తెలిస్తే మతిపోతుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *