ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్‌రైటర్, సంగీత దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. యమలీల ఆయన కెరీర్లో ఒక విశేషమైన చిత్రంగా నిలిచింది. అయితే, ఈ సినిమా నిర్మాణం వెనుక అనేక సవాళ్లు, సినీ పరిశ్రమ నుంచి ఎదురైన నిరాకరణలు దాగి ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో, కృష్ణారెడ్డి గారు యమలీల ప్రయాణాన్ని గురించి వివరించారు. ఎస్.వి. కృష్ణారెడ్డి తన సినీ ప్రస్థానంలో ఎల్లప్పుడూ కొత్త ప్రయోగాలు చేయడానికి, విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కొత్తగా ఆలోచించడం తప్ప పాతగానో, రొటీన్గానో ఆలోచించలేను అని ఆయన తెలిపారు. యమలీల చిత్రానికి సంబంధించి, కథానాయకుడిగా అలీని ఎంపిక చేయడం అప్పట్లో ఒక సంచలన నిర్ణయం. అలీని హీరోగా ఎంపిక చేసినప్పుడు పలువురు మహానుభావులు ఫోన్ చేసి పెద్ద పెద్ద హీరోలు ఉండగా అలీ ఎందుకు.? అని ప్రశ్నించినట్లు కృష్ణారెడ్డి గారు గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
అయితే, అలీ మాత్రమే ఈ పాత్రకు సరైనవాడని ఆయన గట్టిగా నమ్మరు. అలీ సైతం తాను హీరో ఏంటి అని షాక్‌కు గురయ్యారట. ఆ సమయంలో అలీకి సినిమాకు రూ. 50,000 పారితోషికం ఇచ్చినట్లు కృష్ణారెడ్డి గారు వెల్లడించారు, అప్పటి వరకు అలీ రూ. 1,000-5,000 మాత్రమే అందుకునేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా, హీరోయిన్ గా సౌందర్య, విలన్ గా కోట శ్రీనివాసరావు కూడా మొదట ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారని. సౌందర్య, నేను పెద్ద పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను, అలీ పక్కన ఎలా చేయగలను.? అని ప్రశ్నించగా, కోట శ్రీనివాసరావు పెద్ద హీరోల పక్కన విలన్‌గా చేస్తాను, అలీ పక్కన ఎలా ఉంటుంది.? అని అడిగారట. అయితే, కృష్ణారెడ్డి గారు వారి నిర్ణయాలను గౌరవించి ఒకే అని చెప్పారట. ఎవరైనా నెగెటివ్ చెబితే చాలు, అది నా కథపై ఉన్న కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుంది అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
యమలీల ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే అచంచలమైన నమ్మకం ఆయనలో ఉంది. పరిశ్రమ కొత్త కథలను ఆదరించదని, ప్రజలు మాత్రమే వాటిని స్వాగతిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. పాత, రొటీన్ కథలనే పరిశ్రమ ఎక్కువగా కోరుకుంటుందని, కానీ కొత్తగా ఆలోచించేవారే నిలబడతారని ఆయన విశ్వసించారు. తనికెళ్ల భరణి పోషించాల్సిన విలన్ పాత్ర కోసం మొదట ఎంపిక చేసిన కోటా నిరాకరించినప్పుడు.. భరణిని సంప్రదించి ఒప్పించినట్లు కృష్ణారెడ్డి గారు వెల్లడించారు. సౌందర్యను మనవరాలి పెళ్లి సినిమాలో చూసి, ఆ తర్వాత యమలీలలో అవకాశమిచ్చారట. యమలీలకు ముందు ఆ సినిమా విడుదల కాలేదు. యమలీల ఘన విజయం సాధించిన తర్వాత, సౌందర్య లాంటి పెద్ద నటీమణి కృష్ణారెడ్డికి ఫోన్ చేసి, మీ తదుపరి సినిమాలో చిన్న వేషం అయినా ఇస్తారా? అని అడిగారట. అప్పుడు కృష్ణారెడ్డి గారు ఆలోచించి చెప్తానని బదులిచ్చారట. ఈ సంఘటన తర్వాత, సుభలగ్నం చిత్రంలో బాబూ మోహన్ పక్కన సౌందర్యకు ఒక సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.