Actor Satya: ‘జెట్లీ’ హీరో సత్య ఫ్యామిలీని చూశారా? కూతురికి ఎవరి పేరు పెట్టుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Actor Satya: ‘జెట్లీ’ హీరో సత్య ఫ్యామిలీని చూశారా? కూతురికి ఎవరి పేరు పెట్టుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు


టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సత్య. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అతను ఆ తర్వాత కమెడియన్ గా మారాడు. స్వామి రారా, ఛలో, కార్తికేయ, రౌడీ ఫెలో, సూర్య వర్సెస్ సూర్య, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రంగ స్థలం, చల్ మోహన్ రంగా, గద్దల కొండ గణేష్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, కార్తికేయ 2, గీతాంజలి మళ్లీ వచ్చింది, ఛారి 111, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మత్తు వదలరా, మత్తు వదలరా 2 తదితర సినిమాలు సత్యకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక గతంలోనూ కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన సత్య ఇప్పుడు జెట్లీ అంటూ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం (మే 01) రిలీజైన ఈ సినిమా డీసెంట్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో జెట్లీ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పాడు.


ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మాట్లాడిన సత్య తనకు పెళ్లి అయ్యిందని, 9 ఏళ్ళ కుమార్తె కూడా ఉందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సత్యకు అంత పెద్ద కూతురు ఉందా..? అని నోరెళ్ల బెడుతున్నారు. కాగా తన కుమార్తె పేరు వెనక ఒక పెద్ద కథ కూడా ఉందని సత్య తెలిపాడు. తన కూతురు పేరు సుధీర అని, తనకు స్వామి రారా సినిమాతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్ సుధీర్ వర్మ మీద ఉన్న గౌరవంతో తన కూతురుకు సుధీర అని పేరు పెట్టినట్లు సత్య పేర్కొన్నాడు. ప్రస్తుతం సత్య కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

భార్య కూతురితో నటుడు సత్య

Actor Satya

Actor Satya Family

జెట్లీ తర్వాత సత్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పెద్దిలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జెట్లీ సినిమా ప్రమోషన్లలో సత్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *