ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు పది సినిమాలు వస్తే అందులో ఒకటో రెండో సినిమాలు మెప్పిస్తున్నాయి. కానీ అప్పట్లో ప్రతి సినిమా కొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కినవే.. ఎన్నో రకాల కొత్త కథలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఫ్యామిలీ, పౌరాణికం, జానపదం, ప్రేమకథ చిత్రాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే దిగ్గజ నటులు కూడా ఎన్నో సూపర్ హిట్స్ అందించి మెప్పించారు.. వారిలో శ్రీదేవి ఒకరు. ఈ అందాల తార ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. అలాగే ఎన్నో క్లాసిక్ సినిమాలు చేశారు శ్రీదేవి. కాగా ఇప్పుడు శ్రీదేవి నటించిన ఓ క్లాసిక్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. 44ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా ఎదో తెలుసా.? అదే ఎవర్ గ్రీన్ మూవీ వసంత కోకిల.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
వసంత కోకిల.. దక్షిణ భారతీయచిత్రాల్లో ఒక క్లాసిక్ . ఈ సినిమా తమిళ్ భాషలో రుపొంచించారు. అక్కడ ఈ సినిమా పేరుమూండ్రం పిరై, తరువాత తెలుగు లో డబ్ చేసి “వసంత కోకిల”గా విడుదల చేశారు. ఈ సినిమా భారీ హిట్ అయ్యింది. బాలు మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు.. నటించారు అనడం కంటే జీవించారు అనడం కరెక్ట్ ఏమో..
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా ఒక ఎమోషనల్ ప్రేమకథ. ఒక స్కూల్ టీచర్ ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన యువతిని రక్షించి, ఆమెను చూసుకుంటాడు. ఆమె చిన్నపిల్లల మానసిక స్థితిలో ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. కానీ, ఆమె మళ్లీ తన తిరిగి జ్ఞాపకశక్తి పొందిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. చివరికి వారి ప్రేమ ఒక విషాదాంతంతో ముగుస్తుంది ఈ క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగు వర్షన్ తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది ;అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.