RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించి, జైపూర్ కోటలో రాయల్స్ గర్జనకు బ్రేక్ వేశారు. ఆరంభం నుంచి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఢిల్లీ ఓపెనర్లు, జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పతుమ్ నిసాంక, కేఎల్ రాహుల్ కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చారు. పతుమ్ నిసాంక కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రాజస్థాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. అతను 33 బంతుల్లో 62 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, అప్పటికే ఢిల్లీ స్కోరు 100 దాటింది. మరోవైపు కేఎల్ రాహుల్ తన మార్క్ క్లాస్ షాట్లతో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు.