EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త.. రూ.7,500కి పెంపు.. త్వరలో కేంద్రం ప్రకటన..!

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త.. రూ.7,500కి పెంపు.. త్వరలో కేంద్రం ప్రకటన..!


ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శుభవార్త అందించేందకు సిద్దమవుతోంది. పీఎఫ్ కనీస పెన్షన్ పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కూడా చేపట్టారు. అలాగే దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసన కూడా చేపట్టాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్ పరిమితి పెంచేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో త్వరలోనే పెంపుపై ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు.

రూ.7,500కి పెన్షన్ పెంపు

ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. దానిని రూ.7,500కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దీనిపై కీలక ప్రకటన చేశారు. పెన్షన్ పెంపు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని, దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో కనీస పెన్షన్ పరిమితి పెంపుపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఉండగా.. రూ.7,500కి పెరిగితే.. ఒకేసారి 7.5 రెట్లు పెరిగినట్లు అవుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా అధిక పెన్షన్ పొందే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.వెయ్యి ఖర్చులకు సరిపోవడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో పెన్షన్ చేతికి అందితే ఆర్ధిక ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. ఈపీఎస్-95 స్కీమ్ కింద ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం సర్వీస్ కాలంతో సంబంధం లేకుండా పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు.

ఉద్యోగుల్లో ఆశలు

పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తెలిపింది. కానీ తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. అటు కేంద్రం త్వరలో ఈ-ప్రాప్తి పేరుతో కొత్త పోర్టల్ తీసుకురానుంది. పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయినా, యూఏఎన్ నెంబర్ మర్చిపోయినా దీని ద్వారా ఆన్‌లైన్‌లో సులువుగా సేవలు పొందవచ్చు. అలాగే ఇనాక్టివ్ అయిన అకౌంట్లలోని నగదును విత్ డ్రా చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడనుంది. త్వరలోనే ఈ పోర్టల్ తీసుకురానున్నట్లు మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. అలాగే త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా ప్రవేశపెట్టనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *