Andhra: ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను

Andhra: ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను


పట్టపగలు.. ప్రయాణికుల ముసుగులో దోపిడీ! సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఈ ఘటన భయాందోళనకు గురిచేస్తోంది. హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజేశ్వరమ్మను ఓ ఆటో డ్రైవర్ “ఆటో కావాలా మేడం” అంటూ పిలిచాడు. అప్పటికే ఆటోలో కొంతమంది ప్రయాణికులు ఉండడంతో అది సర్వీస్ ఆటో అని నమ్మి ఆమె ఎక్కింది. కుటుంబ సభ్యుల్లా కనిపించిన వాళ్లు ఉండడంతో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే హిందూపురం నుంచి సోమందేపల్లి వెళ్లే మార్గంలో, కేతగాని చెరువు కట్ట వద్ద జనసంచారం లేని ప్రదేశంలో ఆటోను ఆపారు. అక్కడే అసలు ప్లాన్ బయటపడింది. ఆటోలో ఉన్నవారంతా కలిసి రాజేశ్వరమ్మపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సుమారు ఐదు తులాల బంగారు నగలను దోచుకున్నారు. అనంతరం ఆమెను ఆటో నుంచి కిందకు తోసి పరారయ్యారు.

మొదట తనతో ప్రయాణిస్తున్నవాళ్లు సహాయం చేస్తారని భావించిన రాజేశ్వరమ్మకు.. వారంతా ఒకే ముఠాకు చెందినవారని అప్పుడు తెలిసింది. అంతేకాదు, ఆటోలో ప్రయాణికురాలిలా ఉన్న మహిళ డ్రైవర్ భార్యేనని బాధితురాలు వెల్లడించింది. గాయపడిన రాజేశ్వరమ్మ తన భర్తకు ఫోన్ చేయగా, వెంటనే ఆమెను హిందూపురం తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆమె ఆటో ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో, పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుల్లా నటిస్తూ ఒంటరి మహిళలను టార్గెట్ చేసే గ్యాంగ్ పనిచేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోలో ఇతర ప్రయాణికులు ఉన్నారని నమ్మి నిర్లక్ష్యం చేయొద్దు. అపరిచిత వాహనాల్లో ప్రయాణించే ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *