Headlines

ఆటగదరా శివ..! అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వని యజమాని..పుట్టెడు శోకంతో ఇంటిల్లిపాది

ఆటగదరా శివ..! అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వని యజమాని..పుట్టెడు శోకంతో ఇంటిల్లిపాది


ఆటగదరా శివ..! అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వని యజమాని..పుట్టెడు శోకంతో ఇంటిల్లిపాది

కరీంనగర్ చింతకుంట గాంధీనగర్ లో విషాదం నిండిన వేళ ఇంటి యజమాని అమానుషంగా వ్యవహరించారు. చింతకుంట గాంధీనగర్‌లో నివసించే శ్రీకాంత్ అనే వ్యక్తి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులకు ఎదురుదెబ్బ తగిలింది. మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చేది లేదని అద్దె ఇంటి యజమాని ఖరాఖండిగా చెప్పారు. శవం వస్తే ఇల్లు అపవిత్రమవుతుందనే మూఢనమ్మకంతో ఆ యజమాని అమానుషంగా ప్రవర్తించారు.

ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో, ఆ కుటుంబం కరీంనగర్ సప్తగిరి కాలనీ సమీపంలోని శ్మశానాన్ని ఆశ్రయించింది. భార్య రూప ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీకాంత్ తల్లి పద్మావతి కాటిలోనే కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకును కోల్పోయిన మాకు నీడ లేకుండా చేశారని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కదిలించింది. కనీస కనికరం లేని ఈ ఘటన సమాజంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. భార్య రూప తో పాటు కుటుంబ సభ్యులు స్మశానంలో ఉంటున్నారు. ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన రూమ్లో కాలం గడుపుతున్నారు. అయితే స్మశాన పక్కనే ఉండడంతో పిల్లలు భయపడుతున్నారు.

11 రోజుల పాటు ఇక్కడే ఉండి..కార్యక్రమం తర్వాత వెళ్లే పరిస్థితినెలకొంది. ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోతే అద్దె ఇంటివారు రానివ్వని రోజు ఎక్కడో అక్కడ తలదాచుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ మూఢాచారం నుంచి జనం బయటపడాలని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.  ఎవరైనా అనారోగ్యం గురై చనిపోతే ఇంటి యాజమాన్లు ఇంట్లోకి రానివ్వడం లేదు.. దీంతో బిక్కుబిక్కుమని దూరంగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాంత్ కుటుంబం కూడా 11 రోజుల పాటు స్మశాన వాటికలో భయం భయంగా గడిపారు..తమను ఆదరించేవారు ఆదరించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ టీం ఆర్థిక సాయం అందించారు. శ్రీకాంత్ కుటుంబానికి 50 వేల రూపాయల తో పాటు నిత్యావసర వస్తువులు అందించారు..ఈ మూఢ నమ్మకాల నుంచి జనం బయట కీ రావాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *