తొందరపాటులో చేసే చిన్న తప్పులు ఒక్కోసారి పెద్ద నష్టాన్నే మిగులుస్తాయి. అలాంటి టైంలో ఆదుకోవడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతికి అలాంటి అనుభవమే ఎదురైంది. మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాటిని తీసుకొచ్చే డెలివరీ బాయ్స్..ఇంట్లో ఎవరూ లేకపోతే ఏకంగా ఆర్డర్ కాన్సిల్ చేస్తారు. కానీ పార్సిల్ డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఆశ్చర్యపోయి నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్‌లైన్‌లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని ఫోన్‌లో ఆమెకు తెలియచేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. అతను కేవలం పార్సెల్‌ను వదిలి వెళ్లిపోలేదనీ ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడనీ దివ్య ఉన్ని చెప్పుకొచ్చింది. తన పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడనీ తను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడనీ తెలిపింది. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఆ డెలివరీ బాయ్‌కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది. ఆ వీడియోను దివ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతను గుర్తించి మెలిగిన విధానం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. మార్నింగ్ టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకూ ఇళ్లకు, ఆఫీస్‌లకు నిర్విరామంగా ఫుడ్ డెలివరీ చేస్తూ సమయంతో పోటీ పడుతుంటారు డెలివరీ boys . వారితో పని చేయించుకుంటున్న సంస్థలు టైమ్ లోగా డెలివరీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు వర్షాల వంటి పరిస్థితుల్లో సమయానికి ఆహారాన్ని గమ్యస్థానాలకు చేర్చలేకపోతున్నారు. దీంతో కమిషన్ వెనక్కి తీసుకుంటున్నారు. పైకి రోజంతా తిరిగే ఉద్యోగమే అయినా, మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌ల జీవితాలు కష్టతరంగా మారాయని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ