స్నానం చేయకుండా ఎవరుంటారు చెప్పండి ప్రతి రోజూ ప్రతి ఒకరు ఉదయం తప్పకుండా స్నానం చేస్తారు. ఇక కొంత మంది అయితే ఉదయం, సాయంత్రం రెండు సార్లు స్నానం ఆచరిస్తారు. రోజూ వారి చేసే పనులలో ఇది చాలా ముఖ్యం. అయితే ఒకొక్కరూ ఒక్కో విధంగా స్నానం చేస్తారు. ముఖ్యంగా చాలా మందికి స్నానం చేసే నియమాల గురించి ఎక్కువగా తెలియదు. దీంతో చాలా తప్పులు చేస్తుంటారు.
కాగా, ఈ క్రమంలో అసలు స్నానం ఎలా చేయాలి? దీని గురించి పూర్వీకులు, వేదాలు ఏం చెబుతున్నాయి. ఈ తరం వారు స్నానం చేసే సమయంలో చేసే అది పెద్ద తప్పు ఏమిటి? స్నానం తప్పు విధానంలో చేయడం వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు. అసలు దీని గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారో, వివరంగా తెలుసుకుందాం. కొంత మందికి ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి పూజ చేసే అలవాటు ఉంటుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసి పూజ చేసుకుంటారు. ఇక ఇలా ప్రతి రోజూ స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మనసు తేలికపడుతుంది. చాలా ఎనర్జటిక్‌గా ఉంటారు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేయడం చాలా మంచిదైనప్పటికీ, ఈ సమయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. ముఖ్యంగా చాలా మంది ఒంటిపై ఎలాంటి వస్త్రం లేకుండా స్నానం చేస్తారు. కానీ ఇలా చేయడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట. ఎట్టి పరిస్థితుల్లో బట్టలు లేకుండా స్నానం చేయకూడదు అని చెబుతున్నారు నిపుణులు.
పూర్వం కూడా పెద్దలు చిన్న పలచటి పొరలాంటి క్లాత్ చుట్టుకొని స్నానం చేసేవారు, బట్టలు లేకుండా స్నానం చేయకూడదు, దీని వలన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించి, అవి మీపై ప్రభావం చూపుతాయి. దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అందుకే కనీసం ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలంట.
అలాగే ఎవరు అయితే ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేస్తారో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారంట. నగ్నంగా స్నానం చేయడం లక్ష్మీదేవికి అస్సలే నచ్చదంట. ఇది ఇంటిలో ఆర్థిక సమస్యలకు, అప్పుల బాధలకు కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.




