Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..


సాధారణంగా సంగీతానికి భాష ఉండదు, అలాగే కాలపరిమితి కూడా ఉండదు. కొన్ని పాటలు విడుదలైనప్పుడు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో, దశాబ్దాలు గడిచినా అదే తాజాదనాన్ని అందిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన పాటల జాబితాలో మొదటి వరుసలో నిలుస్తుంది ఈ సాంగ్. దాదాపు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కుర్రాళ్లు తెగ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అటు యూట్యూబ్ లో ఈ సాంగ్ దూసుకుపోతుంది. అదే ‘ప్రేమ దేశం’ (1996) చిత్రంలోని “ప్రేమా ప్రేమా” సాంగ్. ఈ పాట విడుదలై నేటికి సుమారు 30 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ సంగీత ప్రియుల ఫేవరెట్ లిస్టులో ఉండటం విశేషమనే చెప్పాలి.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఈ పాట ఇంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం ‘మ్యూజిక్ మేస్ట్రో’ ఏ.ఆర్. రెహమాన్ అందించిన మ్యూజిక్. అప్పట్లో ఆయన అందించిన సరికొత్త ట్యూన్స్ యువతను ఊర్రూతలూగించాయి. ముఖ్యంగా ఈ పాటలో వినిపించే గిటార్ బిట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తన అమృత గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ప్రేయసి దూరమైనప్పుడు కలిగే బాధను, ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకునే ప్రియుడి వేదనను ఎంతో ఆర్ద్రంగా పలికించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

ఇక స్క్రీన్ మీద అబ్బాస్ లుక్స్ , ఆ పాట చిత్రీకరణ కూడా ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. కాలేజీ కుర్రాళ్ల కలల రాకుమారిగా టబు, స్నేహం-ప్రేమ మధ్య నలిగే యువకుడిగా అబ్బాస్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. దర్శకుడు కదిర్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. అందుకే ఈ పాట కేవలం వినడానికే కాదు, చూడటానికి కూడా ఎంతో హాయినిస్తుంది. నేటి సోషల్ మీడియా కాలంలో కూడా ఈ పాట క్రేజ్ తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో “ప్రేమా ప్రేమా” సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు వినడానికి యువత మొగ్గు చూపే మొదటి పాట ఇదే. 90వ దశకం నాటి వారికే కాదు, నేటి జెన్-జీ (Gen-Z) తరానికి కూడా ఈ పాట ఒక ఎమోషన్ అనే చెప్పాలి.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ప్రేమ ప్రేమ వీడియో సాంగ్..



ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *