Headlines

Tollywood : రీల్ టూ రియల్: వెండితెరపై మెరిసి.. నిజ జీవితంలో మురిసిన స్టార్ కపుల్స్!

Tollywood : రీల్ టూ రియల్: వెండితెరపై మెరిసి.. నిజ జీవితంలో మురిసిన స్టార్ కపుల్స్!


సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ పుట్టే ప్రేమకథలు కేవలం సిల్వర్‌ స్క్రీన్‌ మీద మూడు గంటలకే పరిమితం కాకుండా, జీవితాంతం తోడుండే బంధాలుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన టాలీవుడ్ సెన్సేషన్ విజయ్‌ దేవరకొండ – రష్మిక లేటెస్ట్ ఎగ్జాంపుల్‌. వెండితెర మీద జోడీ కట్టి, రియల్‌ లైఫ్‌లో దంపతులుగా మారి, ఇప్పుడు మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ మీద సరికొత్తగా కెమిస్ట్రీ పండించడానికి రెడీ అవుతున్న సూపర్‌ జోడీలెవరు? సెట్స్ మీదున్న సినిమాలేంటి? చూసేద్దాం వచ్చేయండి….

రష్మిక – విజయ్ దేవరకొండ: సెన్సేషనల్ జోడీ

రష్మిక – విజయ్‌ దేవరకొండ పేర్లు వినగానే ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’ అంటూ గుండెల్లో బీట్‌ మోగుతుంది. ‘గీత గోవిందం’ సినిమాతో ఈ జంట సృష్టించిన మేజిక్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో వీరిద్దరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రీసెంట్‌గా జైపూర్‌ వేదికగా భార్యాభర్తలైన ఈ జంట ‘రణబాలి’లో ‘ఏందయ్యా సామి ఇట్ట కాస్తాంది వెన్నెల’ అంటూ స్క్రీన్‌ మీద సందడి చేస్తుంటే, సినిమా రిలీజ్‌కి ఇంకెన్ని రోజులున్నాయో లెక్కలేసుకుని సంబరపడిపోతున్నారు అభిమానులు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

జెనీలియా – రితేష్ దేశ్‌ముఖ్: క్యూటెస్ట్ కపుల్

రితేష్, జెనీలియా జోడీ అంటేనే ఒక పాజిటివ్ వైబ్. వీరిద్దరూ తమ కెరీర్‌ను ‘తుఝే మేరీ కసమ్’ సినిమాతో కలిసి ప్రారంభించారు. పదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట, బయట ఎప్పుడు కనిపించినా, చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ మధ్య ‘వేద్’ (Ved) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘రాజా శివాజీ’తో మ్యాజిక్‌ రిపీట్‌ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫుల్‌ రన్‌ టైమ్‌లో ‘రాజా శివాజీ’ కలెక్షన్స్ ఎలాంటి మేజిక్స్ చేస్తాయో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ…

కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా: షేర్షా జోడీ

‘షేర్షా’ సినిమాలో విక్రమ్ భాత్రా – డింపుల్ చీమా పాత్రల్లో సిద్ధార్థ్, కియారాల నటన చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకుడు లేడు. ఆ సినిమా సెట్స్‌లోనే మొదలైన వీరి పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్ళింది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ మరో భారీ ప్రాజెక్టులో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి ఆజ్యం పోసేలా ‘నాతో నటించబోయేది ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ సిద్ధార్థ్‌ టీజ్‌ చేసిన తీరు, అందులో కియారా షేడ్‌ ప్రేక్షకులను ఊరిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

ఆలియా భట్ – రణబీర్ కపూర్: పవర్‌ఫుల్ పెయిర్

రణబీర్, ఆలియా ఇద్దరూ క్రేజీ స్టార్స్. వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా వీరి కెరీర్‌లో ఒక మైలురాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ నెక్స్ట్ రేంజ్‌కి టర్న్ తీసుకుంది. ప్రస్తుతం ఈ క్రేజీ కపుల్ తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేయడమే కాకుండా, ‘లవ్ అండ్ వార్’ (Love and War) అనే సినిమాలో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘రామాయణ’ షూట్‌ కంప్లీట్‌ అయ్యాక ‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్‌లోనూ నటించబోతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

రియల్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌లో అదే గ్రేస్‌ని చూపిస్తున్న వీరి కోవలోకి… నెక్స్ట్ ఎవరు చేరుతారు? అనే ఆసక్తి కూడా క్రియేట్‌ అవుతోంది. రణ్‌ వీర్‌ అండ్‌ దీపికకు ఇప్పట్లో అయితే ఛాన్స్ లేదు. మరి, ఈ రేసులో నెక్స్ట్ ఇంకే కపుల్‌ ముందుకొస్తుందో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ…

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *