సంతానం, ధనం, విద్య, గృహం, అదృష్టం వంటి విషయాలకు కారకుడైన గురువు విజ్ఞానం, వివేకం, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ వంటి విషయాలకు సంబంధించిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులవారికి పిల్లల విషయంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి. ప్రస్తుతం గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి పిల్లల పిల్లల భవిష్యత్తు కొత్త విద్యా సంవత్సరంలో ఉజ్వలంగా ఉండబోతోంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు పిల్లల నుంచి అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు.