Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? డబ్‌స్మాష్ వీడియోల నుంచి వెండితెర వెరకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? డబ్‌స్మాష్ వీడియోల నుంచి వెండితెర వెరకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్


Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? డబ్‌స్మాష్ వీడియోల నుంచి వెండితెర వెరకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లో ఈ బ్యూటీ బాగా ఫేమస్. హీరోయిన్ కాదు కానీ అంతకు మించిన క్రేజ్, పాపులారిటీ ఈ ముద్దుగుమ్మకు ఉందని చెప్పుకోవచ్చు. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా గ్రామ్ రీల్స్, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. తన క్యూట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ అడుగు పెట్టింది. విజేతగా నిలవకున్నా తన అందం, ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను కట్టి పడేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ తర్వాత ఈ బ్యూటీ రేంజ్, క్రేజ్ రెండూ మారిపోయాయి. సినిమా ఛాన్సులు వచ్చాయి. టీవీ షోల్లోనూ అవకాశం వచ్చింది. అయితే వీటన్నిటికంటే తరచూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ఆ మధ్యన రామ్ గోపాల్ వర్మకు బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చి సంచలనం రేపింది. ఇప్పుడు పెళ్లి పేరుతో ఓ ఎన్నారైను మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈపై ఫొటోలో ఉన్న క్యూటీ మరెవరో కాదు అషూ రెడ్డి.

బిగ్ బాస్ రియాలిటీ షోతో బాగా ఫేమస్ అయిన అషురెడ్డి పై ఈ మధ్యన సంచలన ఆరోపణలు వచ్చాయి. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. అషూరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు సీసీఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఎలాంటి వాస్తవాలు లేవని, అందుకే ఆ కేసుని కొట్టేయాలని కోర్టులో అషూ రెడ్డి అభ్యర్థించినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. కాగా మొన్నటి వరకు ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్‌తో అషు రెడ్డి పేరు నెట్టింట్లో తెగ మార్మోగింది. ఇప్పుడు ఈ ఛీటింగ్ కేసుతో ఈ బిగ్ బాస్ బ్యూటీ మరోసారి ట్రెండ్ అవుతోంది.

అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤ (@ashu_uuu)

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *