ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా


Ms. Narayana

ప్రముఖ నటుడు ఎం.ఎస్. నారాయణ తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఎం.ఎస్. తెలుగు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఎం.ఎస్. నారాయణ. ఆయన మరణాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎం.ఎస్. నారాయణ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని పలు కోణాలను వివరించారు. తన కుమారుడిని చిత్రసీమకు పరిచయం చేసే క్రమంలో దర్శకుడిగా తనే బాధ్యతలు తీసుకోవలసి వచ్చిందని తెలిపారు. ఇతర దర్శకులు తన కుమారుడిపై నమ్మకం చూపకపోవడంతో, తన బిడ్డ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉండటంతో తనే దర్శకత్వం వహించినట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, భగవంతుడిచ్చిన సంపదలో కొంత ఖర్చు చేసి సినిమా తీశానని, ప్రమోషన్ సరిగా లేకపోవడం వల్లే సినిమా విజయం సాధించలేదని, తన దర్శకత్వ లోపం కాదని స్పష్టం చేశారు. ఆ చిత్రం టీవీలో దాదాపు 50 సార్లు ప్రసారమైందని అన్నారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

ఆ తర్వాత భజంత్రీలు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును వదిలివేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే సహ నటులను అనుకరించడం లేదా సెటైరికల్‌గా చూపించే పారడీ పాత్రల గురించి మాట్లాడుతూ.. తాను వాటిని పూర్తిగా ఆస్వాదిస్తానని అన్నారు. ఒక నటుడిగా, దర్శకుడు చెప్పిన పనిని చేయడం తన బాధ్యత అని, అందుకు తాను ప్రతిఫలం పొందుతానని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరినీ అనుకరించినా, వారు చాలా సహృదయులని, మీరు అలా ఎలా చేశారేంటి.? అని అడిగేవారు లేరని ఎం.ఎస్. నారాయణ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

తన పేరడీ చూసి సూపర్ స్టార్ కృష్ణ తిడతారేమో అనుకున్నా కానీ ఆయన ఎంతో మెచ్చుకున్నారని, అల్లు రామలింగయ్యలా అవుతాడు అని విజయ నిర్మలగారిని పిలిచి చెప్పారని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో ఒక విలన్ పాత్ర పోషించాలనే ఆశ తనకు ఉందని తెలిపారు. తనను బాధించిన సంఘటనల గురించి ప్రస్తావించగా, తనకంటే చిన్నవారైన బంధువులు ముందుగా మరణించడం చాలా బాధాకరమని అన్నారు. పది మంది తోబుట్టువులలో చివరిదైన తన చెల్లి మరణం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. అప్పుడు తను చిన్న టీచర్‌గా, చాలీ చాలని జీతంతో కష్టపడుతుండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన చెల్లికి ఆర్థికంగా ఏమీ ఇవ్వలేకపోయానని, ఇప్పుడు బ్రతికి ఉండుంటే ఎంతో ఇచ్చేవాడినని భావిస్తుంటానని ఎం.ఎస్. నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *