LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.!

LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.!


తనదైన శైలి కామెడీతో అటు కమెడియన్‌గా.. అలాగే పంచ్ డైలాగులతో ఇటు రచయితగా ప్రముఖ నటుడు ఎల్‌.బి.శ్రీరామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న ఇబ్బందులు, అలాగే నటుడు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటక రంగం నుంచే ఎల్‌.బి.శ్రీరామ్, కోట శ్రీనివాసరావుల మధ్య పరిచయం ఉంది. ఎల్‌.బి.శ్రీరామ్ రచించిన నాటకాలను కోట శ్రీనివాసరావు బ్యాంక్ పోటీలలో ప్రదర్శించేవారు.

ఆపై వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎల్బీ శ్రీరామ్ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, తన సోదరుడి సలహాతో కోట ఇంటికి వెళ్లారట. అక్కడ వారం రోజులు ఉన్నా, తాను అవకాశాల కోసం వచ్చానని చెప్పడానికి శ్రీరామ్ సంకోచించడం.. కోట శ్రీనివాసరావు తన బిజీలో తాను ఉండటం వల్ల ఏర్పడిన ఆ ‘కమ్యూనికేషన్ గ్యాప్’ గురించి ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జంధ్యాల, ఆత్రేయ, ముళ్ళపూడి వెంకటరమణ లాంటి దిగ్గజ రచయితలు ఉన్నకాలంలో కొత్తవారికి అవకాశం రావడం అంటే ఆషామాషీ కాదు.

వర్మ ‘శివ’ సినిమా తర్వాతే ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ముఖ్యంగా, తన ఆత్మాభిమానం గురించి ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం. తనకు అప్పట్లో గోస్ట్ రైటింగ్‌కు సంబంధించి అవకాశాలు వచ్చాయని, పెద్ద పెద్ద దర్శకులు క్రాంతి కుమార్, ఈ.వి.వి. సత్యనారాయణ లాంటివారు కూడా అడిగారని ఎల్‌.బి.శ్రీరామ్ పేర్కొన్నారు. తన పేరు లేకుండా ఇతరుల కోసం రాసే ‘గోస్ట్ రైటింగ్’ అవకాశాలను ఆయన సున్నితంగా తిరస్కరించారు. “నా పేరు లేకుండా నా డైలాగ్ పెన్ను కదలదు” అని చెప్పడం ఆయనలోని నిజాయితీకి నిదర్శనం. ఎంతటి పెద్ద దర్శకులు అడిగినా, తన గుర్తింపును పణంగా పెట్టడానికి ఆయన ఎప్పుడూ అంగీకరించలేదట.

Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *