అమెరికాకు ‘గుండెపోటు’ తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్!

అమెరికాకు ‘గుండెపోటు’ తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్!


అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు ‘కొత్త ఆయుధాల’ హెచ్చరికల వరకు వెళ్లింది. అమెరికా బలగాలకు త్వరలోనే ‘గుండెపోటు’ తెప్పించే ఆయుధాన్ని ప్రయోగించబోతున్నామంటూ ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని ఇరానీ హెచ్చరించారు. “మా దగ్గర ఒక కొత్త ఆయుధం ఉంది. అది శత్రువుల పక్కనే పొంచి ఉంది. అతి త్వరలోనే దాన్ని ప్రయోగిస్తాం, అది చూసి అమెరికాకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయం” అంటూ షారమ్ ఇరానీ సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ రహస్య ఆయుధం ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై ఇప్పటికే క్షిపణులతో విరుచుకుపడ్డామని, శత్రువులు పశ్చాత్తాపం చెందేవరకు పోరాటం ఆపబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించారు. అణు ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని, సైనిక చర్య కంటే ఈ ఆర్థిక దిగ్బంధనమే టెహ్రాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చర్చలకు రావాల్సిందేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్, దిగ్బంధనం ఎత్తేసే ప్రసక్తే లేదని అమెరికా.. ఇలా ఇరు పక్షాలు భీష్మించుకు కూర్చోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎప్పుడు ఎగిసిపడతాయోనన్న ఆందోళన నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలో వద్దనుకున్న వాటిని.. విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నాం.. ఆస్ట్రేలియాలోని భారతీయ మహిళ వైరల్

స్మార్ట్‌ఫోన్‌లకు చెక్ పెడుతున్న ‘టిన్ క్యాన్’

Rama Prabha: హీరో ఛాన్స్‌ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు

కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి

అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *