NPSలో అన్‌క్లైయిమ్‌ డబ్బును వడ్డీతో ఎలా పొందాలో తెలుసా? ఈ ప్రాసెస్‌ ఫాలో అయిపోండి!

NPSలో అన్‌క్లైయిమ్‌ డబ్బును వడ్డీతో ఎలా పొందాలో తెలుసా? ఈ ప్రాసెస్‌ ఫాలో అయిపోండి!


NPSలో అన్‌క్లైయిమ్‌ డబ్బును వడ్డీతో ఎలా పొందాలో తెలుసా? ఈ ప్రాసెస్‌ ఫాలో అయిపోండి!

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPSystem)లో పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది ఖాతాదారులకు ఒక ముఖ్యమైన సూచన వెలువడింది. గతంలో చేసిన కానీ ఖాతాలో జమ కాని కాంట్రిబ్యూషన్లు ఉన్నా, అవి శాశ్వతంగా కోల్పోయినట్లుకాదని నిపుణులు చెబుతున్నారు. అర్హులైన వారు నిర్దిష్ట ప్రక్రియ ద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA), ‘సబ్‌స్క్రైబర్స్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ప్రొటెక్షన్ అకౌంట్’ (SPCPA) అనే ప్రత్యేక భద్రతా ఖాతాను నిర్వహిస్తోంది. ఇందులో సబ్‌స్క్రైబర్ చెల్లించినప్పటికీ PRAN (పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్)కు జమ కాని నిధులు నిల్వ ఉంటాయి. PRAN సృష్టించకపోవడం, సిస్టమ్ లోపాలు లేదా మధ్యవర్తుల సమస్యలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

సాధారణంగా క్లెయిమ్ చేయని నిధులు 7 సంవత్సరాల తర్వాత SPCPAకు బదిలీ అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మధ్యవర్తి అంతరాయం వల్ల ముందుగానే కూడా బదిలీ కావచ్చు. ముఖ్యంగా PoP లేదా అగ్రిగేటర్ ద్వారా చెల్లించిన మొత్తాలు ఖాతాలో కనిపించకపోతే, సబ్‌స్క్రైబర్లు క్లెయిమ్‌కు అర్హులవుతారు. క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా, నిర్దేశిత ఫారం మరియు చెల్లింపు రుజువులను సమర్పించాలి. ఈ క్లెయిమ్‌ను PFRDAకి నేరుగా లేదా సంబంధిత మధ్యవర్తి ద్వారా దాఖలు చేయవచ్చు. SPCPAలోకి బదిలీ అయిన తేదీ నుంచి 25 సంవత్సరాల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ధృవీకరణ అనంతరం, అసలు మొత్తం మాత్రమే కాకుండా వర్తించే వడ్డీతో కూడిన మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

నిపుణుల ప్రకారం చాలా మంది సబ్‌స్క్రైబర్లు తమ పాత పెట్టుబడులను పూర్తిగా ట్రాక్ చేయకుండా వదిలేస్తారు. దీంతో నిధులు సంవత్సరాల తరబడి నిలిచిపోతాయి. అందుకే పాత రికార్డులను సమీక్షించి, అవసరమైతే వెంటనే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించడం అవసరమని సూచిస్తున్నారు. దీని ద్వారా పదవీ విరమణ నిధులు భద్రంగా తిరిగి పొందవచ్చని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *