ఆస్ట్రేలియాలో ఉంటున్న స్మిధ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో ఉన్నప్పుడు మనం తేలికగా తీసుకునే ఎన్నో సంప్రదాయాలు, అలవాట్లకు విదేశాల్లో ఎంత విలువ ఉందో ఆమె తన వీడియోలో వివరించారు. భారతదేశంలో “టూ దేశీ”గా భావించే అంశాలు విదేశాల్లో ఎలా “ప్రీమియం”గా మారాయో ఆమె చెప్పిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియోలో.. విదేశానికి వెళ్లాక తనలో కలిగిన మార్పు గురించి ప్రస్తావించారు. ఒకరోజు తన ఇంటి దగ్గర్లోని కేఫ్‌కు వెళ్లగా, అక్కడ ‘టర్మరిక్ లాటే’ కోసం జనం క్యూలో నిల్చోవడం చూశానని, దాని ధర 8 డాలర్లు అని తెలిపారు. ఆ క్యూలో తను కూడా నిల్చున్నప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చి ఇబ్బందిగా అనిపించిందని ఆమె చెప్పారు. ఒకప్పుడు తన అమ్మ ఇంట్లో రోజూ పసుపు పాలు చేసి ఇచ్చేది కానీ, తను తాగకుండా తప్పించుకునే దాన్ననీ చెప్పుకొచ్చింది. అవే పదార్థాలు, అవే పాలు, అదే వెచ్చదనం.. కానీ అప్పుడు అది తనకు నచ్చేది కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. అదే తరహాలో మరో ఉదాహరణ కూడా పంచుకున్నారు. ఇంట్లో ఎవరూ పట్టించుకోని ఓ చేనేత దుపట్టా ఉండేదని, కానీ అలాంటి వస్తువులే ఇప్పుడు విదేశాల్లోని స్టోర్లలో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని గమనించానని తెలిపారు. మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి మన సంప్రదాయాలను కోల్పోవడం లేదు. మన సంస్కృతి విలువను మనమే గుర్తించడం మానేస్తున్నాం. ఇక్కడ పాతకాలం పద్ధతులని ముద్ర వేసిన వాటికే, విదేశాల్లో ఎంతో విలువ ఇస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్మిధ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించారు. “మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం” అని ఒకరు కామెంట్ చేయగా, “భారత్‌లో కంటే విదేశాల్లోనే యోగా శిబిరాలు ఎక్కువగా చూశాను” అని మరొకరు రాసారు. “చలికాలంలో పసుపు పాలు ఎంతో మంచివి” అంటూ తమ అనుభవాలను ఇంకొందరు పంచుకున్నారు. మొత్తంగా మన సంప్రదాయాల పట్ల మన దృక్పథం మారాల్సిన అవసరం ఉందని ఈ వీడియో గుర్తుచేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మార్ట్ఫోన్లకు చెక్ పెడుతున్న ‘టిన్ క్యాన్’
Rama Prabha: హీరో ఛాన్స్ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు
కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!