సీతా లక్ష్మీ.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ కార్తీక దీపం సుమిత్ర అంటే ఇట్టే గుర్తు పడతారు. అందులో దీప తల్లిగా ఆమె అభినయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో చాలా భాగం ఏడుస్తూనే కనిపిస్తుంటుంది సుమిత్ర. అయితే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తనకు కష్టాలు ఉన్నాయంటోంది సీత. ఇదిలా ఉంటే ఈ నటి ఈ మధ్యన పలు మార్లు బుర్ఖాలో కనిపించింది. అలాగే బొట్టు పెట్టుకోదు. నమాజ్ కూడా చేస్తుండటం చూసి చాలా మంది ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలు, అనుమానాలన్నింటీకి తెరదించింది సీత. నెటిజన్లు కొద్ది రోజులుగా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది సీత. చాలా రోజులుగా ఈ ఇష్యూ గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని.. తన ఫాలోవర్స్‌కి తన మీద చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పిన సీత.. వాటిని ఇప్పుడు తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చింది. సీతా లక్ష్మీ అనే పేరు ఉంది కదా.. పేరులో సీత ఉండి.. బుర్కా ఎందుకు ధరిస్తున్నారని.. చాలా మంది అడుగుతుంటారని.. అయితే తాను ఇలా కావాలనే ధరిస్తున్నా నంటూ చెప్పుకొచ్చింది. తనకు అమ్మానాన్నలు పెట్టిన పేరు సీతా లక్ష్మీ అని.. ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్‌లో కూడా సీతా లక్ష్మీ అనే ఉంటుందని చెప్పిన ఆమె.. చాలా మంది లాగే తన లైఫ్‌లో కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉందిని సీత చెప్పుకొచ్చింది. 2013 తరువాత దాదాపు నాలుగేళ్లు తాను యాక్టింగ్ కు దూరమయ్యానని.. తాను విడాకులు తీసుకున్నానని.. చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతనితో చెప్పుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. మనకి ఓ తోడు కావాలి కదా అని అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. నాకు మా ఇంటి తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. కాబట్టి మా అత్తగారి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ కావాలంటే కొన్ని విషయాలు నేను చేయక తప్పదు. అందుకే నేను కొన్ని పరిస్థితుల్లో వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి.. యాస్మిన్ అయ్యింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. యాస్మిన్ అని పేరు మార్చుకున్న తరువాత.. యాక్టర్ యాస్మిన్ అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే నాకు సీతగానే గుర్తింపు ఉంది. అందుకే ఇండస్ట్రీలో సీత అనే పేరుతోనే కొనసాగుతున్నా’ అని చెప్పుకొచ్చింది సీత అలియాస్ యాస్మిన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..
సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..