ప్రస్తుతం, బయోపిక్ చిత్రాల పట్ల ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖల జీవితాలకు సంబంధించిన రియల్ స్టోరీలకు కాసుల వర్షం కురుస్తోంది. సాధారణంగా ఇలాంటి బయోపిక్ సినిమాలు స్ఫూర్తినిస్తాయి. ఆయా రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల నిజ జీవితంలోని సంక్షోభాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అదే సమయంలో ఈ బయోపిక్స్ పట్ల కొంచెం నెగెటివీటీ కూడా ఉంది. ఇలాంటి సినిమాల్లో నిజాలను దాచి పెడతారన్న అపవాదు కూడా ఉంది. ఇటీవల విడుదలైన ‘మైఖేల్’ సినిమా విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఆంథోనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఈ బయోపిక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 220.83 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 2080 కోట్ల రూపాయలను వసూళ్లను చేసింది. భారతదేశంలో ఈ మూవీ వసూళ్లు క్రమంగా పెరుగుతూ సుమారు రూ. 20 కోట్లకు చేరుకున్నాయి. సంగీత ప్రియులు, మైఖేల్ జాక్సన్ అభిమానులు ఈ చిత్రాన్ని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ తో రాబోయే రోజుల్లో మైఖేల్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ‘మైఖేల్’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. 2026 సంవత్సరపు అగ్ర చిత్రాల జాబితాలో ఈ చిత్రం ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది. ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’, ‘పెగాసస్ 3’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘హాపర్’ ‘వుథరింగ్ హైట్స్’ వంటి సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో, కేవలం కొద్ది రోజుల్లోనే 1800 కోట్లు వసూలు చేసిన ‘ధురందర్ 2’ రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. అలాగే ‘భూత్ బంగ్లా’ కలెక్షన్లను కూడా అధిగమించింది. రాబోయే రోజుల్లో ‘మైఖేల్’ కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనూ రోజు రోజుకూ ఈ మూవీ వసూళ్లు పెరుగుతున్నాయని ..ఇదే కొనసాగితే త్వరలోనే ఈ బయోపిక్ ‘టాప్ 5’ లోకి కూడా చేరగలదని చాలామంది నమ్ముతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. అసలు విషయం చెప్పిన కార్తీక దీపం సుమిత్ర