మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. అనాథ బాలుడికి అండగా నిలిచి, పేరు పెట్టి బారసాల చేసి..

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. అనాథ బాలుడికి అండగా నిలిచి, పేరు పెట్టి బారసాల చేసి..


రాజకీయ నాయకులు కేవలం ప్రజల సమస్యలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఆదర్శంగా నిలవగలరని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిరూపించారు. పుట్టకతోనే అనాథగా మారిన ఒక చిన్నారికి తానూ ఉన్నానంటూ భరోసా ఇచ్చి, ఆ బాబు భవిష్యత్తుకు బాటలు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం పరిధి రాంజీగోండ్ నగర్ కు చెందిన అనాథ బాలుడికి బారసాల కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు దంపతులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఈ వేడుక‌ను ఘనంగా నిర్వహించారు. ఆ అనాథ బాలుడికి ‘ఆవిర్భావ్’ అని నామకరణం చేశారు. బాలుడి తల్లి గంగు బాయి నెలన్నర క్రితం రక్తహీనతతో చనిపోయింది. తండ్రి విఠల్ బాబు పుట్టక ముందే 5 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

తల్లిదండ్రులు ఇద్దరు ఊహ తెలియక ముందే చనిపోవడంతో ఆ బాలుడు అనాథగా మారాడు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. బాబు పుట్టిన అప్పటి నుంచి శిశువుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చి.. ఐటీడీఏ తరపున రూ.1.90 లక్షల చెక్కును బాలుడి నానమ్మ గంగమ్మకు అందించి మాట నిలుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

అక్కడితో ఆగకుండా ఆ బాలుడికి ఘనంగా బారసాల కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జు. సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఆ బాలుడికి ఆవిర్భావ్ అని నామకరణం చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు బొజ్జు. ఆవిర్భావ్ నేటి నుండి మా ఇంట్లో ఒకడని.. ఈ బాబు చదువుకు అయ్యే అన్ని ఖర్చులు భరిస్తానని, బాలుడి ఎదుగుదలకు అన్నీ తానై అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

వీడియో ఇక్కడ చూడండి…

ఆవిర్భావ్ ఎదుగుదలకు అయ్యే పూర్తి బాధ్యత తనదేనని, చదువుకు అయ్యే అన్ని ఖర్చులు తానే భరిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఒక అనాథ బాలుడిని తమ ఇంట్లో సభ్యునిగా స్వీకరించిన ఎమ్మెల్యే దంపతులపై సోషల్ మీడియాలో మరియు స్థానికంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *