సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరి పేరు అయితే ఎస్ లెటర్‌తో ప్రారంభం అవుతుందో వారు చాలా ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరికంటే చాలా భిన్నంగా ఉంటారు. వీరు తమ జీవితంలోని చాలా విషయాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కుటుంబం, సక్సెస్‌కు సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతాడు.
అలాగే వీరికి కష్టపడే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని అయినా సరే పట్టుదలతో చేస్తారు. అంతే కాకుండా వీరు తమ కంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే ఆనందంగా జీవిస్తారు. అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకొని, జీవితంలో ఒడిదుడుకులను దాటుకొని ముందుకు వెళ్తారు. జీవితంపై వీరికి మంచి క్లారిటీ ఉంటుంది. ఏపని ప్రారంభించినా పట్టు వదలకుండా చేస్తారు.
అలాగే వీరికి ఒక పని కాకుండా ఒకేసారి నాలుగు లేదా ఐదు పనులు చేయడానికి ఇష్టపడతారు. మంచి తెలివితేటలు ఉంటాయి. అంతే కాకుండా ఎదుటి వారిని ఆకట్టుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరంగా, వ్యాపార పరంగా వీరు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. వీరిలో ఉండే మంచి గుణం వీరి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
అదే విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలు అయ్యే వ్యక్తులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేయడానికి మాత్రం ముందుంటారు. కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు.
ఇక ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలు అయ్యే వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు అదే వీరిని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. అందువలన ఇలాంటి విషయాల్లో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




