ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ విషయంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు అప్డేట్ సర్వీస్ ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది. ఆధార్ సర్వీసులను పొందే ముందు సర్వీస్ ఛార్జీల గురించి తెలుసుకోవాలని, అపరేటర్‌కు ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించవద్దని సూచించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఆధార్ సర్వీస్ ఛార్జీల వివరాలను యూఐడీఏఐ వివరించింది. ఏ సర్వీస్‌కు ఎంత ఛార్జీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఆధార్ సర్వీస్ ఛార్జీలు
-ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ అనేది పూర్తిగా ఉచితం
–బయోమెట్రిక్స్(ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో) అప్డేట్‌కు సంబంధించి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు తొలిసారి అప్డేట్ చేయించుకుంటే ఉచితం
-ఇక 15 నుంచి 17 సంవత్సరాల వయస్సులో తొలిసారి లేదా రెండోసారి అప్డేట్ చేయించుకున్నా ఉచితమే
-ఏడు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో చేయించుకునేవారు సెప్టెంబర్ 30,2026 వరకు ఉచితంగా చేయించుకోవచ్చు. ఆ తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్ కోసం రూ.125 చెల్లించాలి
-డెమోగ్రాఫిక్స్ అయిన పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ లాంటివి బయోమెట్రిక్స్‌తో పాటు అప్డేట్ చేయించుకుంటే ఉచితమే
-ఇక డెమోగ్రాఫిక్స్ ప్రత్యేకంగా అప్డేట్ చేయించుకోవాలంటే రూ.75 సర్వీస్ ఛార్జీ ఉంటుంది
-పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అప్డేట్ చేసుకునేందుకు ధృవీకరణ కోసం గుర్తింపు పత్రాలు సబ్మిట్ చేసేందుకు ఆధార్ సెంటర్లలో అయితే రూ.75 చెల్లించాలి. అదే యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మనం చేసుకుంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఉచితంగా చేసుకోవచ్చు
-5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవచ్చు
పీవీసీ కార్డ్ కోసం..
ఇక ఆధార్ పీవీసీ కార్డు కావాలంటే రూ.75 చెల్లించి యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు తరహాలోనే ఈ కార్డు అనేది ఉంటుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఇది ఉంటుంది. పాలీవినైల్ క్లోరైడ్‌తో వీటిని తయారుచేస్తారు. ప్రస్తుత ఉన్న పేపర్ ఆధార్ కార్డులు చినిగిపోయే అవకాశముంటుంది. అయితే పీవీసీ కార్డులకు అలాంటి సమస్య అనేది ఉండదు. దీంతో చాలామంది ఈ కార్డుల కోసం ఆర్డర్ పెట్టుకున్నారు. గతంలో రూ.25కే పీవీసీ కార్డ్ పొందే సౌకర్యం ఉండగా.. ఇప్పుడు యూఐడీఏఐ ధరను పెంచింది. అయినా చాలామంది ఈ కార్డు కోసం ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ కార్డు వల్ల అనేక లాభాలు ఉండటంతో చాలామంది తీసుకుంటున్నారు.
Before availing Aadhaar services, please check the applicable charges to avoid paying any extra amount to the operator.#Aadhaar #UIDAI #AadhaarServices #DigitalIdentity #DigitalIndia pic.twitter.com/Z76irFx4IR
— Aadhaar (@UIDAI) April 30, 2026