మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, రవి, కుజ, బుధ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు, సూచ నలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధి స్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.