Headlines

Indian Railways: ట్రైన్‌లో మీరు బుక్ చేసుకున్న సీటులో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ పెడితే మీ ప్రాబ్లం క్లియర్..

Indian Railways: ట్రైన్‌లో మీరు బుక్ చేసుకున్న సీటులో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ పెడితే మీ ప్రాబ్లం క్లియర్..


ట్రైన్‌లో మీరు బుక్ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా..? లేవమని చెప్పినా సదరు ప్రయాణికులు మీ సీట్లో నుంచి లేవడం లేదా..? అయితే మీరు వారితో గొడవ పడక్కర్లేదు. మీరు వారిపై రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు సైలెంట్‌గా ఒక్క మెస్సేజ్ పెడితే చాలు.. టికెట్ కలెక్టర్, రైల్వే పోలీసులు వచ్చి మీ సీటు ఖాళీ చేయిస్తారు. ఈ మేరకు ప్రయాణికులు ఎస్‌ఎంఎస్ రూపంలో ఫిర్యాదు చేసే సదుపాయాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. అసలు ఈ ప్రాసెస్ ఏంటి..? ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

మెస్సేజ్ పంపడం ఎలా..?

మీరు ట్రైన్లో వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటులో వేరే వ్యక్తి కూర్చున్నాడనుకుందాం. మీరు చెప్పినా అతను మీ సీటును ఖాళీ చేయకపోతే రైల్వేశాఖకు ఫిర్యాదు చేయొచ్చు. 139 నెంబర్‌కు మీ సీటు నెంబర్, మీ పీఎన్‌ఆర్ నెంబర్ టైప్ చేసి మెస్సేజ్ పెట్టాలి. SEAT స్పేస్ మీ పీఎన్‌ఆర్ నెంబర్ స్సేస్ మీ సీటు నెంబర్ స్పేస్ OCCUPIAED BY UNKNOWN PASSENGER అని టైప్ చేసి 139 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. మీరు మెస్సేజ్ పెట్టగానే ట్రైన్లో ఉండే టీసీ, రైల్వే పోలీసులకు సమాచారం అందుతుంది. వెంటనే వాళ్లు మీ సీటు వద్దకు చేరుకుని మీ సీటు ఆక్రమించిన వ్యక్తిని ఖాళీ చేయిస్తారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఈ సదుపాయం అమల్లోకి తెచ్చింది.

యాప్ ద్వారా కంప్లైంట్ చేయడమెలా..?

-రైల్ మదద్ యాప్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఫిర్యాదు చేయవచ్చు

-ఇక https://railmadad.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు

-ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి

-మీ పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి

-టైప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కంప్లైంట్‌ను సెలక్ట్ చేసుకోండి

-ఇన్సిడెంట్ డేట్ సెలక్ట్ చేసుకుని ఫిర్యాదును రాయండి

-ప్రోసీడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-రైల్వేశాఖ అధికారులు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు

ఈ నెంబర్ ఆధారంగా..

ఇక ఆర్‌పీఎఫ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేసి కూడా సహాయం పొందవచ్చు. 182 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీంతో  అధికారులు చేరుకుని మీ   సమస్యకు పరిష్కారం చూపుతారు. ఇలా రైల్వేశాఖ అనేక ఆప్షన్లను ప్రవేశపెట్టింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *