కల్వకుంట్ల కవిత సారథ్యంలోని ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ పేరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, సీఈసీ అధికారులు గురువారం (ఏప్రిల్ 30) బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకుని పార్టీ అనుమతి పత్రాన్ని అందజేశారు.
ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ నినాదంగా ఉన్న TRS పేరును తిరిగి వాడుకలోకి తెస్తూ, ‘తెలంగాణ రక్షణ సేన’గా దీనిని రూపుదిద్దారు. ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు ఈ పరిణామాన్ని ఘనంగా వేడుక చేసుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..