బోటీ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు : బోటీ అర కేజీ, ఎండు మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి వన్ టీ స్పూన్, కారం టూ టీ స్పూన్స్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పూదీనా.
తయారీ విధానం : ముందుగా బోటీ తీసుకోవాలి. దానిని ఒక బౌల్లో వేసి నీళ్లు, ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మ రసం వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత అది ఉడికిన తర్వాత మరిగే నీటిలో ఈ ఉడికిన బోటీని వేసి శుభ్రం చేసుకోవాలి. దీని వలన బోటీ ఎలాంటి స్మెల్ రాకుండా , శుభ్రంగా ఉంటుంది.
ఇప్పుడు ఎండు మిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, మూడు మిరియాలు వేసి, మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోటీ ఫ్రై తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో బోటీ వేసి, కారం ఉప్పు, అల్లం వెల్లులి వేసి మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఎండు మిర్చి పౌడర్ వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి, మంచి స్మెల్ వచ్చే వరకు కలపాలి.
తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బోటీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక పదినిమిషాల తర్వాత ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. మరో పదినిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు స్టవ్ పై ఉండనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ ఎండు మిర్చి బోటీ ఫ్రై రెడీ.




