బజాజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటీలు.. పాత ధరలోనే అప్డేటెడ్‌ ఫీచర్లు!

బజాజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటీలు.. పాత ధరలోనే అప్డేటెడ్‌ ఫీచర్లు!


బజాజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటీలు.. పాత ధరలోనే అప్డేటెడ్‌ ఫీచర్లు!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ స్థానం మరింత బలపరుచుకునేందుకు బజాజ్‌ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన బజాజ్‌ చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లైనప్‌కు తాజా పనితీరు, ఫీచర్ అప్‌డేట్‌లను అందించింది. ముఖ్యంగా ఈ అప్‌డేట్ల​ తర్వాత కూడా ధరలను పెంచకపోవడం వినియోగదారులకు ఆకర్షణీయంగా మారింది. కంపెనీ ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఐదు వేరియంట్లలో అందిస్తోంది. గతంలో C2501, C3001, C3501, C3502, C3503 పేర్లతో ఉన్న మోడళ్లను ఇప్పుడు C25, C30, C35 వంటి సింపుల్ పేర్లతో మార్చింది. ఈ మార్పుతో పాటు అన్ని వేరియంట్లలో పలు అప్డేట్‌లు చేపట్టడం గమనార్హం.

పనితీరు పరంగా బేస్ వేరియంట్ టాప్ స్పీడ్‌ను 55 కి.మీ/గం నుండి 60 కి.మీ/గం వరకు పెంచగా, మధ్యస్థ వేరియంట్లలో ఇది 70 కి.మీ/గం వరకు చేరింది. టాప్ ఎండ్ మోడళ్లలో గరిష్ట వేగం 80 కి.మీ/గం వరకు ఉంది. అదనంగా బ్యాటరీ ఛార్జింగ్ వేగం కూడా మెరుగుపరచబడింది. ముఖ్యంగా ఒక వేరియంట్‌లో 0-80 శాతం ఛార్జింగ్ సమయం 3.5 గంటల నుండి 2.55 గంటలకు తగ్గించబడింది. ఫీచర్ల విషయానికి వస్తే ఎకో, స్పోర్ట్ మోడ్‌లతో పాటు హిల్-హోల్డ్ అసిస్ట్‌ను ఇప్పుడు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అంతేకాకుండా టాప్ వేరియంట్లలో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల సౌకర్యం కూడా కల్పించారు. దీంతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరింతగా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను యాప్ ద్వారా కనెక్ట్ చేసే సదుపాయం కూడా జోడించారు.

రేంజ్ పరంగా బేస్ వేరియంట్ 113 కి.మీ. వరకు ప్రయాణించగలగగా, ఇతర వేరియంట్లు 127 కి.మీ. నుండి 153 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తున్నాయి. ధరలు రూ.89,500 నుండి రూ. 1.34 లక్షల మధ్య ఉన్నాయి. మొత్తంగా పనితీరు, ఫీచర్లలో మెరుగుదలలు చేసి కూడా ధరలను యథాతథంగా ఉంచడం ద్వారా బజాజ్ చేతక్ స్కూటర్లు మార్కెట్లో మరింత పోటీగా మారాయి. ప్రత్యేకించి రూ.1 లక్ష లోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక ఆకర్షణీయ ఎంపికగా నిలుస్తోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *