
అమరావతి, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈ రోజు (ఏప్రిల్ 30) గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నేరుగా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్, లీప్ యాప్ ద్వారా కూడా నేరుగా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.