హైదరాబాద్, ఏప్రిల్ 30: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 (యూజీసీ నెట్) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. యూజీసీ ఆధ్వర్యంలో ఎన్టీఏ ఏటా రెండుసార్లు దీన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. యూజీసీ నెట్లో అర్హత సాధించిన వారు ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ పరిశోధనలో కొనసాగడానికీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడటానికీ, పీహెచ్డీలో చేరడానికీ, కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలకూ నెట్ స్కోర్ చాలా కీలకం. 2026 ఏడాదికి రెండో సెషన్ ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
యూజీసీ-నెట్ జూన్ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీలో అర్హత పొందినవారితో పాటు.. ప్రస్తుతం పీజీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు మే 20, 2026వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు కొనసాగుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, వికలాంగ అభ్యర్ధులు రూ.325 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
యూజీసీ-నెట్ జూన్ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూజీసీ-నెట్ జూన్ 2026 షెడ్యూల్ ఇదే..
- యూజీసీ-నెట్ జూన్ 2026 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 29, 2026.
- ఆన్లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: మే 20, 2026.
- దరఖాస్తు సవరణ తేదీలు: మే 22 నుంచి 24, 2026వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు
- సిటీ ఇంటిమేషన్ స్లిప్లు విడుదల తేదీ: జూన్ 10, 2026 నుంచి
- అడ్మిట్ కార్డులు విడుదల తేదీ: జూన్ 15, 2026వ తేదీ నుంచి
- యూజీసీ-నెట్ జూన్ 2026 ఆన్లైన్ రాత పరీక్షల తేదీలు: జూన్ 22 నుంచి 30, 2026వ తేదీ వరకు
యూజీసీ-నెట్ జూన్ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.