గతవారమే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలి సారి పోటీలో నిలిచాడు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లోనూ టీవీకే పోటీ చేసింది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. అదే టీఎన్ 2026. ప్రముఖ కమెడియన్ తంబి రామయ్య ఈ సినిమాకు కథ అందించగా, అతని కుమారుడు ఉమాపతి రామయ్య ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన టీఎన్ 2026 పెద్దగా ఆడలేదు. అంతేగాక తమిళనాడు ఎన్నికలపై కూడా పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ సినిమా
ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ఓటీటీల్లో ‘టీఎన్ 2026’ స్ట్రీమింగ్ కానుంది.
ఏప్రిల్ 30 అంటే రేపటి నుంచే అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో టీఎన్ 2026 స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళనాడులోని ఓ స్టార్ హీరో తన అభిమాన సంఘాలు అన్నింటినీ ఏకం చేసి రాజకీయాల్లో అడుగు పెడతాడు. ముఖ్యమంత్రి కావాలని ట్రై చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే ‘టీఎన్ 2026’ కథ. విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. మరి థియేటర్లలో ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
ఏకంగా ఐదు ఓటీటీల్లో టీఎన్ 2026 స్ట్రీమింగ్..
Thalaivar Kulkanth Kumar ungal vedu thedi varugirar!!🙏🏼 #TN2026 streaming from April 30 on @PrimeVideoIN @SimplySouthApp @shortflixindia @APIfilms @ahatamil#ThangaNatchathiram
Produced by #KannanRavi @KRGOffl
#DeepakRavi
@R_chandru @teamaimpr @TN2026official @decoffl pic.twitter.com/ARc88cBGL3— 3rdeyereports (@Padma70328265) April 29, 2026
Edhirkaala Tamil Nadu nirandhara Mudhal Amaichar-ukku vanakkam 🙏🏻#TN2026 streaming from April 30 on API South Cinema | Prime Video 🎞️@PrimeVideoIN pic.twitter.com/OsGbHZaLII
— AP International (@APIfilms) April 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.