PBKS Vs RR: ‘ఒకే ఒక్క ఓటమి.! భయం అది పుట్టించిందే మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం..’

PBKS Vs RR: ‘ఒకే ఒక్క ఓటమి.! భయం అది పుట్టించిందే మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం..’


ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్‌కు రాజస్థాన్ రాయల్స్ గట్టి షాక్ ఇచ్చింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59), మార్కస్ స్టోయినిస్ (62) అర్ధ సెంచరీలతో హోరెత్తించడంతో పంజాబ్ 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(51) కూడా తన ఫామ్‌ను కొనసాగించగా, చివరలో డోనోవన్ ఫెరీరా(52), శుభమ్ దూబేలు మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.

ఈ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. “బ్యాటర్లు అద్భుతంగా ఆడి భారీ స్కోరు అందించారు, కానీ బౌలింగ్ ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా యార్కర్లు, స్లో బాల్స్ వేయాలనుకున్నా అది జరగలేదు. మధ్య ఓవర్లలో ఫెరీరా, శుభమ్ దూబేల భాగస్వామ్యం మ్యాచ్‌ను మమ్మల్ని దూరం చేసింది” అని అయ్యర్ పేర్కొన్నారు. ఇది ఒక మంచి గుణపాఠమని, లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లో బలంగా తిరిగి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు ఈ ఒక్క మ్యాచ్‌తో పాయింట్ల టేబుల్ తలకిందులైంది. రాజస్థాన్ ఓడిపోతే బాగుండునని అనుకున్న అట్టడుగు జట్లకు భంగపాటు ఎదురైంది.

ఇది చదవండి: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *