Red Number Plate: భారత్‌లో వాహనానికి ఎర్రటి నంబర్ ప్లేట్ ఉంటే అర్థమేంటి? ఇది కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

Red Number Plate: భారత్‌లో వాహనానికి ఎర్రటి నంబర్ ప్లేట్ ఉంటే అర్థమేంటి? ఇది కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!


Red Number Plate Vehicles: భారతదేశ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఎరుపు రంగు నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కనిపిస్తే, చాలామందికి అవి ఏమిటి? ఎందుకు అలా ఉన్నాయి? అనే సందేహం కలుగుతుంది. సాధారణంగా మనకు తెలుపు (ప్రైవేట్ వాహనాలు), పసుపు (కమర్షియల్ వాహనాలు) రంగు ప్లేట్లు బాగా తెలుసు. అయితే ఎరుపు రంగు ప్లేట్ ప్రత్యేకమైన అర్థాలను కలిగి ఉంటుంది. ఎరుపు రంగు ప్లేట్‌ దేనికి సంకేతం. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (Temporary Registration):

మీరు కొత్తగా కారు లేదా బైక్ కొన్నప్పుడు షోరూమ్ నుండి డెలివరీ తీసుకున్న వెంటనే దానికి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ (Permanent Number) ఉండదు. ఆ సమయంలో RTO నుండి శాశ్వత నంబర్ వచ్చే వరకు, కొత్త వాహనాన్ని చట్టబద్ధంగా రోడ్డుపై నడపడానికి ఈ ఎరుపు రంగు నంబర్ ప్లేట్‌ను కేటాయిస్తారు. అలాగే ఎరుపు రంగు నంబర్ ప్లేట్ కనిపించడానికి ప్రధాన కారణం అది ‘తాత్కాలిక వాహనం’ అని అర్థం. మీరు కొత్త కారు కొన్నప్పుడు దానికి ఆర్టీఓ (RTO) నుండి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చే వరకు డీలర్లు ఈ తాత్కాలిక నంబర్ ప్లేట్‌ను ఇస్తారు. ఇది ‘ట్రయల్’ లేదా ‘తాత్కాలిక’ ప్లేట్. దీని అర్థం కారు షోరూమ్ నుండి ఇప్పుడే బయటకు వచ్చింది మరియు దానిని టెస్ట్ డ్రైవ్ కోసం ఉపయోగిస్తున్నారు లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం RTOకి తీసుకువెళుతోందని అర్థం. ఇది సాధారణ ప్రజల ఉపయోగం కోసం కాదు.

ఈ రెడ్‌ కలర్‌ నంబర్‌ ప్లేట్‌ కలిగిన వాహనం కనిపిస్తే కాస్త దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్‌ కాలేదు కాబట్టి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా 30 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి

నిబంధనలు: ఈ సమయంలో వాహనాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవచ్చు. కానీ కమర్షియల్ (వాణిజ్య) అవసరాలకు వాడకూడదు. నిర్ణీత గడువులోపు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.

2. ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలు:

కొన్నిసార్లు ఎరుపు రంగు నంబర్ ప్లేట్లపై బంగారు వర్ణంలో జాతీయ చిహ్నం (National Emblem) ఉంటుంది. ఇవి సాధారణ పౌరులకు సంబంధించినవి కావు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల అధికారిక వాహనాలకు మాత్రమే ఈ ప్లేట్లు ఉంటాయి. ఇవి ఆ వాహనం హోదాను, అధికారిక స్థితిని సూచిస్తాయి.

ముఖ్యమైన నిబంధనలు:

  • గడువు ముగిస్తే: 30 రోజుల తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత కూడా ఎరుపు రంగు ప్లేట్‌తో వాహనం నడపడం చట్టరీత్యా నేరం. దీనివల్ల రూ.10,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
  • బీమా: తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో కూడా వాహనానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలి.
  • రాష్ట్రం దాటడం: తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.

ఇతర నంబర్ ప్లేట్ల రంగులు:

భారతదేశంలో రంగులను బట్టి వాహన ప్రయోజనాన్ని సులభంగా గుర్తించవచ్చు:

  • తెల్లటి ప్లేట్: ప్రైవేట్ వాహనాలు (వ్యక్తిగత అవసరాలకు).
  • పసుపు ప్లేట్: కమర్షియల్ వాహనాలు (టాక్సీలు, బస్సులు, గూడ్స్ వాహనాలు).
  • ఆకుపచ్చ ప్లేట్: ఎలక్ట్రిక్ వాహనాలు (EVs).
  • నీలం ప్లేట్: విదేశీ దౌత్యవేత్తలు (Diplomats) వాడే వాహనాలు.
  • నలుపు ప్లేట్: అద్దెకు తీసుకునే (Self-drive rentals) వాహనాలు.

అందుకే తదుపరిసారి మీరు రోడ్డుపై ఎర్రటి నంబర్ ప్లేట్ చూసినప్పుడు అది కొత్త వాహనమని (30 రోజుల లోపు) లేదా ప్రభుత్వ ఉన్నత అధికారుల వాహనమని సులభంగా గుర్తుపట్టవచ్చు. కొత్త వాహనం కొన్నప్పుడు ఆ 30 రోజుల గడువులోపు తప్పనిసరిగా శాశ్వత రిజిస్ట్రేషన్ పొందడం మర్చిపోవద్దు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *