Headlines

IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు షాకే..?

IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు షాకే..?


IPL 2026 Playoffs Race: ప్రస్తుత సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఏమాత్రం కలిసి రావడం లేదు. కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశాలు ఉంటాయి. అయితే, ఫామ్‌లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు జట్లతో తదుపరి మ్యాచ్‌లు ఉండటం కోల్‌కతాకు పెద్ద సవాల్‌గా మారింది. లక్నో పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. రిషబ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. ఒక్క ఓటమి ఎదురైనా లక్నో టోర్నీ నుంచి అధికారికంగా తప్పుకోవాల్సి ఉంటుంది.

సంక్షోభంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్..

ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరింటిలో గెలవాలి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఓటమి చెందడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అత్యంత విచిత్రంగా ఉంది. ఒక మ్యాచ్‌లో 264 పరుగులు చేసిన అదే జట్టు, తర్వాతి మ్యాచ్‌లో 75 పరుగులకే కుప్పకూలడం ఆశ్చర్యకరం. ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఉన్న ఢిల్లీ, ఇకపై ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌లా భావించాల్సి ఉంటుంది.

ఆయుష్ లేని లోటుతో చెన్నై సూపర్ కింగ్స్..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సీజన్ అగ్నిపరీక్షగా మారింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అందుబాటులో లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరో స్థానంలో ఉన్న చెన్నై, తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై, హైదరాబాద్ వంటి బలమైన జట్లను ఎదుర్కోవాలి. సంజు శాంసన్ వ్యక్తిగత ప్రదర్శనపైనే జట్టు ఆధారపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. వరుస విజయాలు సాధించకుంటే ఛాంపియన్ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లక తప్పదు.

ఐపీఎల్ 2026 రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, దిగ్గజ జట్లు సైతం నిలకడ లేని ప్రదర్శనతో వెనుకబడుతున్నాయి. కేవలం అద్భుతాలు జరిగితే తప్ప ఈ ఐదు జట్లు ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌లు ప్రతి జట్టు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *