SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌.. సింపుల్‌గా ఇలా చెక్‌ చేసుకోండి!

SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌.. సింపుల్‌గా ఇలా చెక్‌ చేసుకోండి!


SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌.. సింపుల్‌గా ఇలా చెక్‌ చేసుకోండి!

హైదరాబాద్‌ బుధవారం: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంటి. మరికొన్ని గంటల్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.  హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కాంప్లెక్స్‌లో నిర్వహించే మీడియా సమావేశంలో కే. కేశవరావు కంప్యూటర్ బటన్ నొక్కి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఎగ్జామినేషన్ బోర్డ్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, జిల్లాల వారీగా ర్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పనితీరు వంటి పూర్తి వివరాలను అధికారులు వివరిస్తారు.

రాష్ట్రంలో మార్చి 16 నుండి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్​ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం స్టార్ట్ చేసిన అధికారులు ఈ నెల 23వ తేదీతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే తొలుత మే మొదటి వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికి మిగతా వర్క్ చకాచకా పూర్తి కావడంతో బుధవారం ఫలితాలు విడుదల చేస్తున్నారు.

ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్థులు తమ మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో tv9telugu.com వైబ్ సైట్ లేదా SSC అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాలు తెలుసుకునేందుకు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని.. రిజల్ట్‌ విడుదలైన వెంటనే వెబ్‌సైట్‌లో మీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చూడవచ్చు.

అయితే విద్యార్థులు కేవలం వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే కాకుండా వాట్సప్‌ ద్వారా కూడా మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.  ఇందుకోసం మీరు వాట్సాప్‌లో 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ చేసి.. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు ఎంటర్ చేయండి.  అంతే వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *