OTT Movie: ఆంధ్రా-తమిళనాడు బోర్డర్‌లో 77 హత్యలు.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..

OTT Movie: ఆంధ్రా-తమిళనాడు బోర్డర్‌లో 77 హత్యలు.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..


ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ క్రైమ్ స్టోరీలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. వాస్తవ సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. 1999లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. తమిళంలో తెరకెక్కినప్పటికీ తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళనాడులోని తిరువళ్లూరుకు దగ్గర్లో ఉన్న పొడతూర్‌‌పేటలో 1995లో వరుస హత్యలు జరుగుతాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 77 సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. అవి కూడా ఒకే ప్యాట్రన్ లో. ఊరికి దూరంగా ఇళ్లల్లో ఒంటరిగా ఉండే భార్య, భర్తలను మాత్రమే టార్గెట్ గా చేసుకున్న కిల్లర్స్‌‌‌‌ వారిని దారుణంగా హత్యచేస్తారు. ఆ తర్వాత మగవారి నడుము గొలుసు (మొలతాడు), ఆడవారి మంగళ సూత్రం మాత్రమే తీసుకెళ్లిపోతారు. పైగా సంఘటనా స్థలంలో రక్తంతో ‘‘?’’(ప్రశ్నార్థకం గుర్తు) రాసి వెళ్లిపోతారు. దీంతో ఈ సీరియల్ మర్డర్డ్స్ మిస్టరీ ఏంటో తెలుసుకోలేక పోలీసులు ఆపసోపాలు పడతారు. మరి ఆ 77 హత్యలు ఎవరు చేశారు? అసలు ఆ సీరియల్ కిల్లర్స్ ఉద్దేశమేంటి? అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ సిరీస్ చూడాల్సిందే.

ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఎంగేజింగ్ గా సాగే ఈ సిరీస్ పేరు తడయం. నవీన్ కుమార్ పళనివేల్ తెరకెక్కించిన ఈ రియల్ క్రైమ్ సిరీస్ లో ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. శివదా, సుందర్ పాండియన్, రాజ్ తిరందాస్, మున్నార్ రమేశ్ ఇతర పాత్రల్లో మెరిశారు. అజయ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం తడయం వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే తడయం వెబ్ సిరీస్ మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

 జీ 5 ఓటీటీలో తడయం.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *