OTT Movie : అందరి కళ్లు ఈ సినిమా పైనే..! థియేటర్స్‌లో కుమ్మేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి..

OTT Movie : అందరి కళ్లు ఈ సినిమా పైనే..! థియేటర్స్‌లో కుమ్మేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి..


చిన్న సినిమాలు థియేటర్స్ సత్తా చూపుతున్నాయి. పెద్ద సినిమాలతో పోటీపడకుండా.. సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్నాయి కొన్ని సినిమాలు, చిన్న బడ్జెట్ తో కొత్త కొత్త హీరోలు, దర్శకులతో కంటెంట్ ను నమ్ముకొని తెరకెక్కిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటారు. హారర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ కుమ్మేసింది ఈ సినిమా. హారర్ ప్లస్ కామెడీ మిక్స్ అయిన ఈ సినిమా ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన సినిమాల్లో రాకాస సినిమా ఒకటి. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడిప్పుడే హీరోగా హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు సంగీత్. ఇప్పటికే మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హిట్స్ అందుకున్న సంగీత్.. ఇక ఇప్పుడు రాకాస సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాకాస సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. అలాగే మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

థియేటర్స్ లో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఇక ఇప్పుడు ఓటీటీకి రెడీ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాకాస డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మే 1న రాకాస సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. కాగా రాకాస సినిమాను రూ. 15కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. అలాగే ఓటీటీ డీల్ రూ. 10కోట్లకు జరిగిందని తెలుస్తుంది. ఓటీటీలో రాకాస సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *