సినిమా ఇండస్ట్రీని అనేది అందరికి ఒకేలా ఉండదు. ఎంతో మంది ఇక్కడ రాణించాలని ఎన్నో ఆశలతో అడుగుపెడుతూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అవుతుంటారు. ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నా తర్వాత ఎందుకో పెద్దగా రాణించలేకపోతుంటారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు.
ఒకానొక సమయంలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కుర్రాళ్ళు ఆమె అంటే పడిచచ్చిపోయేవారు. మనకు కూడా ఇంత అందమైన లవర్ ఉంటే బాగుండు అని అనుకోని కుర్రాడు ఉండడు. అంతటి అందం అభినయం ఉన్న ఆమె తక్కువ సినిమాలతోనే మెప్పించింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకునే లోగా ఆమె సినిమాలకు మెల్లగా దూరం అయింది. ఇప్పుడు ఆమె ఎక్కడ కనిపించక పోడంతో ఒకింత నిరాశకు గురవుతున్నారు.
ఆమె ఎవరో కాదు అందాల భామ నమిత. సొంతం సినిమాతో భారీ హిట్ అందుకోవడమే కాదు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది నమిత. ఆ తర్వాత జెమిని, ఐతే ఏంటీ !, నాయకుడు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు జెమిని మినహా మరే సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. చాలా గ్యాప్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో స్పెషల్ రోల్ చేసింది.
బిల్లా సినిమాలో గ్లామరస్ పాత్రలో మెప్పించింది. అలాగే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఆతర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో స్పెషల్ రోల్ అలాగే ఓ సాంగ్ చేసింది. అదేసమయంలో అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది నమిత. 2010 తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. కానీ మిగతా భాషలలో ఆడపాదడప చిత్రాల్లో నటించింది.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ మొన్నామధ్య ఓ ఈవెంట్ లో మెరిసింది. తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంటున్నట్టు తెలిపింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నట్టు తెలిపింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమిత రెగ్యులర్ గా తన ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.




