TS Inter Re-counting 2026 Result: ఇంటర్‌ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు.. ఫలితాలు ఎప్పుడంటే?

TS Inter Re-counting 2026 Result: ఇంటర్‌ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు.. ఫలితాలు ఎప్పుడంటే?


హైదరాబాద్‌, ఏప్రిల్ 27: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలతాలు ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన అనంతరం జవాబుపత్రాల రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ గడువు ఏప్రిల్ 24తో ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 48 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో కొందరు తమకు ఆశించిన మార్కులు రాలేదని, మార్కులు ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తే.. మరికొందరు అసలు తాము పాస్‌ కాలేదని, బాగా పరీక్షలు రాసినా ఫెయిల్‌ అయినట్లు మార్కులు రావడం ఏమిటని సందేహిస్తూ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 7 వేల మంది మార్కుల లెక్కింపుకు దరఖాస్తు చేసుకోగా.. మిగిలిన 41 వేల మంది పునఃపరిశీలన (రీ వెరిఫికేషన్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక మే 13 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జరిగేనాటికి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఈ ప్రక్రియ మొదలైంది. తప్పిన వారితోపాటు మెరుగైనా మార్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను మే 26న నిర్వహిస్తారు. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసేవారికి రెండోసారి జరిగిన పరీక్షలో ఒకవేళ మార్కులు తగ్గితే పాత మార్కులనే కొనసాగిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 టైం టేబుల్ ఇదే

  • మే 13న సెకండ్ లాంగ్వేజ్
  • మే 14న ఇంగ్లిష్‌
  • మే 15న మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్
  • మే 16న మ్యాథ్స్ 2ఏ, జువాల‌జీ, హిస్టరీ
  • మే 18న ఫిజిక్స్, ఎకనామిక్స్
  • మే 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • మే 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
  • మే 21న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *