Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కొత్త కార్యక్రమం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో కొత్త కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ సైంటిస్టులు గ్రామాల్లో పర్యటించనున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి 200 టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లు గ్రామాల్లో పర్యటించడంతో పాటు రైతులతో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ కొత్త కార్యక్రమం ప్రారంభంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.

మే 23 వరకు కార్యక్రమం

మే 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ టీమ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల్లో పర్యటిస్తాయి. ఈ సందర్భంగా రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తాయి. రైతుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించనున్నారు. ఎరువుల వినియోగం, యూరియా వాడకం, సేంద్రీయ వ్యవసాయ పద్దతులు, సాగునీటి పొదుపు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అలాగే రైతులకు పంపిణీ చేసేందుకు 8 రకాల వరి వగడాలను సిద్దం చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సోన, బీపీటీ 5204, జైశ్రీరాం, KNM 1638, HMT, WGL 44, TGC 1798, WGL 962 వంగడాలకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వీటినే రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *