Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..

Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..


టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో విడుదలవుతుందని గతంలోనే ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ధనుష్ నటించిన ‘కర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు, ‘పెద్ది’ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతుందని చెప్పాడు. ఈ ప్రకటనలతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఒక పల్లెటూరి క్రీడల నేపథ్యంలో (Village Sports Backdrop) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుండగా, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని, దానిపై కూడా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుచ్చిబాబు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో కావడంతో ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ ఖరారు కావడంతో ఇక సినిమా ప్రమోషన్ల జోరు పెరగనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ధనుష్ నటిస్తున్న కర చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 30న ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *