Andhra Pradesh: రైతులకు భారీ గుడ్ న్యూస్.. మే 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు..

Andhra Pradesh: రైతులకు భారీ గుడ్ న్యూస్.. మే 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు..


Andhra Pradesh: రైతులకు భారీ గుడ్ న్యూస్.. మే 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు..

అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెండో విడత భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూములిచ్చిన రైతులకు కౌలు సొమ్మును అందించనుంది. వీటిని మే 1వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత భూసేకరణలో స్వచ్చంధంగా భూములిచ్చిన రైతులకు నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు గ్రామాల్లో 16,667 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఈ భూమిని రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వంటి పనుల కోసం కేటాయించనున్నారు.

ప్రైవేట్ ఏజెన్సీలకు ఆదేశాలు

8 ల్యాండ్ పూలింగ్ యూనిట్ల ద్వారా జరుగుతున్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. భూసేకరణలో తలెత్తే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 28 గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఫోర్ స్పేస్ ఇండెక్స్ పెంపుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనిపై పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. రాజధానిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు ఎఫ్‌ఎస్‌ఐ పెంపు దోహదపడుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై కూడా ఈ సమావేశంలో మంత్రి నారాయణ చర్చించారు. మున్సిపల్, నగరపాలక సంస్థల్లో డంపింగ్ యార్డుల్లో ఉన్న వ్యవర్థాలను వెంటనే తొలగించాలని ప్రైవేట్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.

రైతు రుణాలు కూడా మాఫీ

బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాట్ల పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నగరాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దదమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు. అయితే కౌలు కోసం రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కౌలు చెల్లిస్తోంది. ప్రతీ ఏడాది కౌలు చెల్లిస్తూ వస్తోంది. అంతేాకాకుండా రైతుల పేర్లపై బ్యాంకుల్లో ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *