Telangana: తెలంగాణలోని మహిళలకు సూపర్ న్యూస్.. అవి ఫ్రీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: తెలంగాణలోని మహిళలకు సూపర్ న్యూస్.. అవి ఫ్రీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం


Telangana: తెలంగాణలోని మహిళలకు సూపర్ న్యూస్.. అవి ఫ్రీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. తొలుత ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయనుంది. ఆ తర్వాత విడతల వారీగా అర్హులైన మహిళలందరికీ అందించనుంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే మహిళల నుంచి ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. అనంతరం లబ్దిదారులను గుర్తించి కుట్టుమిషన్లు అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే లక్ష్యంతో ఈ పథకం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

బీసీ మహిళలకు శిక్షణ

నైపుణ్యం కలిగిన బీసీ మహిళలను గుర్తించి టైలరింగ్‌లో స్వయం ఉపాధి కల్పించనున్నారు. వారికి టైలరింగ్ అవకాశాలను కల్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది మహిళలు దీని వల్ల స్వయం ఉపాధి పొందటంతో పాటు వారు ఆర్ధికంగా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. త్వరలోనే మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. అనంతరం లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్దిదారుల ఎంపిక జరగనుంది. కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే కాకుండా మహిళలకు అవసరమైన ఇతర వనరులను సమకూర్చనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలకు డిజైనింగ్, ఇతర పనుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఈ కాత్త పథకం వల్ల మహిళలు ఆర్దికంగా వృద్ది చెందటమే కాకుండా స్వయం ఉపాధి పొందనున్నారు. విడతల వారీగా మహిళలందరికీ వీటిని అందించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *