ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన గిల్ దోస్త్.. అదేంటంటే?

ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన గిల్ దోస్త్.. అదేంటంటే?


గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక పోరులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆయన, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సాయి సుదర్శన్, మొదటి నుంచే దూకుడుగా ఆడాడు. ఈ జోడీ కేవలం పది ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగుల మార్కును దాటించి జట్టుకు భారీ పునాది వేసింది.

క్రిస్ గేల్ రికార్డు బద్దలు..

ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సుదర్శన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ ఓవర్ చివరి బంతికి ముందు 66 పరుగులతో ఉన్న ఆయన, ఆఖరి బంతిని భారీ సిక్సర్‌గా మలచడం ద్వారా 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సాయి సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. దీనితో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఆయన అగ్రస్థానానికి చేరుకున్నాడు.

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించిన టాప్-5 ఆటగాళ్లు:

సాయి సుదర్శన్: 47 ఇన్నింగ్స్‌లు

క్రిస్ గేల్: 48 ఇన్నింగ్స్‌లు

షాన్ మార్ష్: 52 ఇన్నింగ్స్‌లు

రుతురాజ్ గైక్వాడ్: 57 ఇన్నింగ్స్‌లు

కేఎల్ రాహుల్: 60 ఇన్నింగ్స్‌లు

భారత దిగ్గజాల సరసన సుదర్శన్..

కేవలం ఇన్నింగ్స్‌ల పరంగానే కాకుండా, ఎదుర్కొన్న బంతుల పరంగా కూడా సాయి సుదర్శన్ భారత మేటి ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేసిన భారతీయుల జాబితాలో అభిషేక్ శర్మ, వీరేందర్ సెహ్వాగ్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, యూసుఫ్ పఠాన్ వంటి హేమాహేమీల సరసన ఆయన నిలిచాడు. సుదర్శన్ ఈ ఘనతను 1361 బంతుల్లో సాధించాడు. తమిళనాడుకు చెందిన ఈ యువ ఆటగాడు నిలకడైన ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు బలం చేకూరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *