తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??


ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలోని తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 2026 వేసవి కొత్త రికార్డులను సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు కేవలం అధిక ఉష్ణోగ్రతల గురించే కాకుండా, గాలిలో తేమతో కూడిన ఉక్కపోత వల్ల కలిగే ప్రాణాంతక ముప్పు గురించి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానవ శరీరం చెమట ద్వారా తనను తాను చల్లబరుచుకుంటుంది. చర్మంపై చెమట ఆవిరిగా మారే ప్రక్రియలో శరీరం నుంచి వేడి బయటకు వెళ్ళిపోతుంది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉండే వాతావరణంలో ఈ ప్రక్రియ సక్రమంగా పనిచేస్తుంది. కానీ, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, అది ఇప్పటికే నీటి ఆవిరితో నిండి ఉండటంతో చర్మంపై చెమట ఆవిరి కాలేదు. దీనివల్ల శరీరం చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా గుండె వేగం పెరగడం, అధిక రక్తపోటు, కొన్ని సందర్భాల్లో అవయవాలు విఫలమవడం, మరణం సంభవించడం జరుగుతాయి. శాస్త్రవేత్తలు ఈ ఉమ్మడి ముప్పును “వెట్-బల్బ్ టెంపరేచర్” WBT తో కొలుస్తారు. ఇది కేవలం గాలి ఉష్ణోగ్రతనే కాకుండా తేమను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. గతంలో మానవ శరీరం 35 డిగ్రీల సెల్సియస్ WBT వరకు తట్టుకోగలదని అనేవారు. తాజాగా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న యువకులు కూడా కేవలం 31 డిగ్రీల WBT వద్ద తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు, 38 డిగ్రీల ఉష్ణోగ్రత, 60 శాతం తేమ కలిస్తే ఆ ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. తీరప్రాంతాలు, రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే భారత్‌కు ఈ ముప్పు మరింత ఎక్కువ. “చాలామందికి పొడి వడగాల్పుల గురించి అవగాహన ఉంది, కానీ తేమతో కూడిన వేడి గురించి తెలియదు. అందుకే ఇది మరింత ప్రమాదకరం” అని నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత 50 డిగ్రీలలా అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఏసీ లేకుండా జీవించడం అసాధ్యం అని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం

Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *