ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!


ప్రపంచంలోని టాప్ 100 వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది. 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అడవులు తగ్గడం, విదర్భ నుంచి వచ్చే వేడి గాలులు ప్రధాన కారణాలు. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది. హైదరాబాద్‌లోని కొత్తపేట కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరిపోతున్నాయి. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉండటం, భూగర్భ జలాలు పడిపోవడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ట్రాప్ అవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల AQI జాబితాను పరిశీలిస్తే అందులో 19 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నగరాలు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలో టాప్‌లో నిలిచాయి. వీటితో పాటు బిహార్‌లోని బెగుసరాయ్, , సివాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం నేపాల్‌లోని లుంబిని కావడం విశేషం. ఏప్రిల్ 22 నుంచి 24 మధ్య దేశంలో వడగాలులు వీస్తాయనీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగొచ్చనీ ఐఎండీ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే దానిని వడగాడ్పుగా పరిగణిస్తారు. నిర్మలమైన ఆకాశంతో సూర్యరశ్మి నేరుగా భూమిని తాకడం, హిమాలయాల్లో మంచు కవచం తగ్గడం, వాయవ్య దిశ నుంచి పొడి గాలులు వీయడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా కారణమని విశ్లేషిస్తున్నారు. రాబోయే వారాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం

Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..

మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *