వేసవి కాలంలో శరీరంపై, ముఖ్యంగా గుండెపై అధిక ప్రభావం పడుతుంది. ఈ సమయంలో చాలా మంది వినోదం కోసం పార్టీలకు హాజరవుతూ, అధికంగా మద్యం, మసాలా ఆహారం తీసుకుంటారు. ఇది గుండె ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తుందని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీకృష్ణ హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో మద్యం సేవించడం వల్ల హాలిడే హార్ట్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల గుండె లయ తప్పుతుంది, రక్తపోటు తగ్గి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అదేవిధంగా, ఒకేసారి ఎక్కువ మొత్తంలో నూనె, మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ ఏర్పడుతుంది, ఇది స్ట్రోక్స్‌కు దారితీస్తుంది. వేసవిలో నిర్జలీకరణం (డీహైడ్రేషన్) వల్ల శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు తగ్గిపోయి గుండె లయ తప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?