Folk Song: ఏముంది మావ ఈ పాట.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న సాంగ్.. ఒక్కసారైనా స్టెప్పు వేయాల్సిందే..

Folk Song: ఏముంది మావ ఈ పాట.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న సాంగ్.. ఒక్కసారైనా స్టెప్పు వేయాల్సిందే..


ఒకప్పుడు జానపద గేయాలు కేవలం పల్లెటూరి పండగలకు, వేడుకలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక, సోషల్ మీడియా పుణ్యమా అని ‘జానపదం’ గ్లోబల్ రేంజ్‌లో మోత మోగిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ప్రస్తుతం వస్తున్న ఫోక్ సాంగ్స్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతూ, పెద్ద పెద్ద సినిమా పాటలకు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘మామిడి కోనల మీద’, ‘బిందె మీద బిందె పెట్టి’, ‘గజులు బంగారు గజులు’ వంటి పాటలు మార్మోగిపోతున్నాయి. సింగర్ ప్రభ, మధుప్రియ, నాగదుర్గ, వైష్ణవి సోనీ వంటి గాయనీ గాయకులు తమ గొంతుతో పల్లె పదాలకు ప్రాణం పోస్తున్నారు. వీటికి తోడు లోకల్ డాన్సర్ల ఎనర్జిటిక్ స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాటలు ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

తాజాగా యూట్యూబ్ లో ఓ ఫోక్ సాంగ్ రచ్చ చేస్తుంది. పక్కా మాస్ వైబ్ ఉన్న ఈ పాటకు కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న పాట “పోరి రాయే జాతర… పోదాము రాయే జాతర” అంటూ సాగే ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా యూత్ నుంచి ఈ పాటకు వస్తున్న క్రేజ్ గురించి చెప్పుక్కర్లేదు. అటు ఇన్ స్టా.. ఇటు యూట్యూబ్ ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగుతుంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాటను సింగర్ ప్రభ, సింగర్ నర్సింలు ఎప్పటిలాగే అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ పాటలో జనత బాబు, వైష్ణవి సోనీ నటించగా.. శ్రీకాంత్ కొరియోగ్రఫీ అందించారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

ప్రస్తుతం పోరి రాయే జాతర సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. నాలుగు నెలల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పుడు మరోసారి తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ? అయితే మీరు ఒకసారి వినండి.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..



ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *